‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం‘జాతిరత్నాలు’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి ప్రేక్షకులు పడిపడి నవ్వారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘జాతి రత్నాలు’టీమ్‌కు భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం జాతి రత్నాలను కూడా వదలలేదు. సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ వీడియో బయటకు వచ్చేసింది.
దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది. కొన్ని వెబ్‌సైట్లు ‘జాతిరత్నాలు’ ఫుల్ మూవీని డౌన్‌లోడ్ లింక్‌ను గురువారమే పెట్టెశాయి. ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనే అని కొంతమంది అంటున్నారు. అందుకే ఆ సైట్‌తో పాటు మరికొన్ని సైట్లల్లో కూడా ఈ మూవీ దర్శనమిచ్చింది. దీంతో చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే ప్రమాదం ఉంది. పైరసీ భూతం ఎఫెక్ట్ ‘జాతి రత్నాలు’కలెక్షన్స్ ఏ మేరకు ఉంటుందో చూడాలి.
చదవండి:
‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment