piracy site
-
‘వైల్డ్ డాగ్’కి ఊహించని ఎదురుదెబ్బ.. షాక్‌లో చిత్ర యూనిట్!
అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్ 2)న విడుదలై మిక్స్డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ నాగ్ ఏసీపీ విజయ్ వర్మగా అదరగొట్టాడు. గత రెండేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కింగ్ నాగ్.. ‘వైల్డ్ డాగ్’తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూశాడు. అనుకున్నట్లే మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘వైల్డ్ డాగ్’టీమ్‌కి భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం ‘వైల్డ్ డాగ్’ని కూడా వదల్లేదు. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే .. పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. పైరసీని ప్రోత్సహించే కొన్ని వెబ్సైట్లు వైల్డ్ డాగ్ పుల్ మూవీ డౌన్లోడ్ లింక్‌ను శుక్రవారమే పెట్టేశాయి. దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది. వాళ్లు ఫుల్ చేస్తే.. వీళ్లు లీక్ చేశారు వైల్డ్ డాగ్ మూవీ విడుదలకు ఒక్క రోజు ముందు అంటే గురువారమే లీకైపోయిందంటూ చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ మూవీస్ ట్వీట్ చేసింది. అయితే అది అబద్దమని, జనాల్ని ఫూల్స్ చేయడానికే అలా చేశామని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఒక్క రోజు తర్వాత నిజంగానే తమ మూవీ నిజంగానే లీకైపోవడంతో చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. మరి పైరసీ భూతం ఎఫెక్ట్ ‘వైల్డ్ డాగ్’ కలెక్షన్స్‌పై ఏ మేరకు ఉంటుందో చూడాలి. చదవండి: వైల్డ్ డాగ్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.. 'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ -
‘జాతిరత్నాలు’ టీమ్‌కి భారీ షాక్, తొలి రోజే ఇలా...
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన చిత్రం‘జాతిరత్నాలు’. మహాశివరాత్రి సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి ప్రేక్షకులు పడిపడి నవ్వారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘జాతి రత్నాలు’టీమ్‌కు భారీ షాక్ తగిలింది. పైరసీ భూతం జాతి రత్నాలను కూడా వదలలేదు. సినిమా విడుదలైన గంటల్లోనే పైరసీ వీడియో బయటకు వచ్చేసింది. దీంతో కలెక్షన్లపై ప్రభావం ఉండే ప్రమాదం ఏర్పడింది. కొన్ని వెబ్సైట్లు ‘జాతిరత్నాలు’ ఫుల్ మూవీని డౌన్లోడ్ లింక్‌ను గురువారమే పెట్టెశాయి. ఇది తమిళ్ రాకర్స్ చేసిన పనే అని కొంతమంది అంటున్నారు. అందుకే ఆ సైట్‌తో పాటు మరికొన్ని సైట్లల్లో కూడా ఈ మూవీ దర్శనమిచ్చింది. దీంతో చాలా మంది ఈ సైట్లను ఆశ్రయించే ప్రమాదం ఉంది. పైరసీ భూతం ఎఫెక్ట్ ‘జాతి రత్నాలు’కలెక్షన్స్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. చదవండి: ‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ జాతిరత్నాలు.. మైండ్ స్విచ్చాఫ్ చేసుకొని చూడండి : బన్నీ -
తలచుకుంటే.. తమిళ్ రాకర్స్ సైట్ ఆట కట్టించవచ్చు
పెరంబూరు: ప్రభుత్వం తలచుకుంటే ఒక్క రోజులోనే పైరసీకి పాల్పడుతున్న తమిళ్ రాకర్స్ వెబ్సైట్ ఆట కట్టించవచ్చునని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ అన్నారు. తమిళ్రాకర్స్ను అడ్డుకోలేకపోయారు గానీ, ఇళయరాజా, ఏఆర్.రెహ్మాన్లకు అభినందన సభలు నిర్వహించడానికి బయలుదేరారు. తమిళ్రాకర్స్ను అడ్డుకోవడం తన వల్ల కాకపోతే నిర్మాతల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని దర్శకుడు వసంతబాలన్ ఇటీవల జరిగిన ఓ చిత్ర ఆడియో విడుదల వేదికపై విశాల్‌ను ఘాటుగా విమర్శించారు. ఇదిలాఉండగా ఇళయరాజా సత్కార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందుకుగానూ ముఖ్యమంత్రికి ఎడపాడి పళనిస్వామిని మంగళవారం విశాల్, ఆయన బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశాల్ మీడియాతో మాట్లాడుతూ తమిళ్ రాకర్స్ తదితర ఆన్లైన్ పైరసీ వెబ్సైట్లను నిలువరించడం అంత సులభం కాదన్నారు. తాను మాత్రమే ఆన్లైన్ పైరసీలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే సరిపోదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ఒక్క రోజులోనే తమిళ్ రాకర్స్ వంటి వెబ్సైట్లను అంతం చేయవచ్చునని అన్నారు. ఈ సమస్య గురించి ఇంతకు ముందే ప్రభుత్వానికి విన్నవించుకున్నామని, ఇప్పుడు మరోసారి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నటుడు పార్థిబన్ మండలి ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగడం గురించి అడిగిన ప్రశ్నకు విశాల్ బదులిస్తూ ఇళయరాజాను, ఏఆర్.రెహ్మాన్లకు ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత పార్థిబన్దేనని అన్నారు. ఇళయరాజా అభినందన సభకు అందరినీ ఆహ్వానించినట్లూ, అయితే అందులో పాల్గొనేదీ, లేనిదీ వారి ఇష్టం అని విశాల్ పేర్కొన్నారు. సంగీత కార్యక్రమానికి ఎంత ఆదాయం వచ్చిందన్న ప్రశ్నకు లెక్కలు అన్నీ చూసిన తరువాత బహిరంగంగా ఆ వివరాలను తెలియజేస్తామని అన్నారు. నడిగర్ సంఘ భవన నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు దాదాపు పూర్తి అయ్యిందని, సినీ కార్యక్రమాలకు హాలు నిర్మాణం మాత్రమే పూర్తి కావలసి ఉందని, జూలైలో సంఘం భవన ప్రారంభోత్సవం ఉంటుందని విశాల్ వెల్లడించారు. -
నిషేధించినా నెట్టింట..
సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’అన్నారు పెద్దలు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అశ్లీల(పోర్న్), సినిమా పైరసీ సైట్ల నిర్వాహకులు ప్రస్తుతం ఇదే సూత్రాన్ని అమలు చేస్తున్నారు. దేశంలో జరుగుతున్న పలు అత్యాచారాలకు కారణంగా నిలుస్తోన్న ఈ వెబ్సైట్లను నిషేధించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా తిమ్మిని బమ్మి చేసే ఆయా సైట్ల నిర్వాహకులు సైట్ల పేరులోని స్పెల్లింగ్‌లో కొద్దిపాటి మార్పు చేసి వీటిని చలామణిలోకి తీసుకొచ్చారు. తిరిగి ఎప్పట్లాగే ఇవి అందరికీ అందుబాటులోకి రావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఎందుకు నిషేధించారు.. ఉత్తరాఖండ్ హైకోర్టులో ఇటీవల ఓ రేప్ కేసు విచారణకు వచ్చింది. స్కూలు విద్యార్థినిపై తోటి బాలుడు అత్యాచారానికి పాల్పడిన కేసు అది. తాను ఈ అఘాయిత్యానికి పాల్పడే ముందు పోర్న్ సైట్లు చూశానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. దీనిపై స్పందించిన కోర్టు అత్యాచారాలకు కారణమవుతోన్న ఇలాంటి అశ్లీల వెబ్సైట్లను వెంటనే నిషేధించాలని సెప్టెంబర్ 27న కేంద్రానికి ఆదేశాలిచ్చింది. నవంబర్ 15లోగా ఈ పనిని పూర్తి చేయాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులు మంత్రిత్వ శాఖకు అక్టోబర్ 8న అందాయి. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ)కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దేశంలో 827 పోర్న్ వెబ్సైట్లను గుర్తించి బ్లాక్ చేశారు. అంతేకాకుండా ఈ జాబితాలోని సైట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రన్ చేయవద్దని ఇంటర్నెట్ సంస్థలకు నోటీసులు కూడా ఇచ్చింది. వీటితోపాటు టెలికామ్ సంస్థలు కూడా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. నియంత్రణ కష్టమే.. ‘మాకు ఆదేశాలు వచ్చిన వెంటనే మేం నిషేధాన్ని అమల్లో పెట్టాం. జాబితాలోని 827 అశ్లీల సైట్లను నిషేధించాం. కానీ, వారు తెలివైనవారు. ప్రపంచంలో ఏదో మూల నుంచి ఆపరేట్ చేస్తారు. తమ వెబ్‌సైట్‌కు వీక్షకులు తగ్గిన విషయం వీరికి తెలిసిన వెంటనే, ఐపీ అడ్రస్, వెబ్సైట్ చిరునామాలో స్వల్ప మార్పులు చేసి నెట్లో సులువుగా దొరికేలా చేస్తారు’అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ప్రైవేటు టెలికామ్ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు. మనమే ఎందుకు లక్ష్యం..! భారత్‌లో జనాభా అధికం. ప్రపంచంలో రెండో స్థానం. జనాభాలో యువత దాదాపు 40 శాతం పైమాటే. దీనికితోడు భారత్‌లో పెరిగిపోతున్న ఇంటర్నెట్ యూజర్లు, మొబైల్ వినియోగదారులను ఈ వెబ్సైట్లు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఏడాది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీవోటీ) ఇచ్చిన నివేదిక ప్రకారం.. భారత్‌లో ప్రస్తుతం 46.36 కోట్లకుపైగా బ్రాడ్‌బాండ్ వినియోగదారులు ఉన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే.. 0.74 శాతం అధికం. ఇక జూన్ 2018 నాటికి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 50 కోట్ల మంది వరకు ఉన్నారు. ఓ సంస్థ అందించిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పోర్న్ వీడియోలు చూసే దేశంలో 2015లో ఇండియా 4వ స్థానంలో ఉండగా, 2016లో 3వ స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో బ్రెజిల్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. పేరు మార్చి మళ్లీ ప్రత్యక్షం.. పోర్న్ వెబ్సైట్లపై నిషేధం విధిస్తారని ఆయా వెబ్సైట్ల నిర్వాహకులకు ముందే తెలుసు. అలాగే 2 వారాలుగా ఆన్లైన్లో వీటిని శోధించినా ఎవరికీ దొరకలేదు. దీంతో వీక్షకులు తగ్గిపోయిన విషయాన్ని ఆయా సైట్ నిర్వాహకులు గుర్తించారు. అందుకే వాటి ఐపీ అడ్రెస్లు, యూఆర్ఎల్ లింకులు, వెబ్సైట్ చిరునామా( డొమైన్ నేమ్) స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులు చేసి తిరిగి రన్ చేస్తున్నారు. ఆ పాత సైట్లన్నీ స్పెల్లింగ్‌లో స్వల్ప మార్పులతో తిరిగి నెట్లో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో అయితే దాదాపు 1,350 పోర్న్‌తోపాటు పైరసీ సినిమా వెబ్సైట్లను పోలీసులు గుర్తించి వాటిని నిషేధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారు పేర్లు మార్చుకుని తిరిగి వస్తుండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
పైరసీ సైట్లపై గూగుల్, మైక్రోసాఫ్ట్ పోరు
లండన్: చట్టవిరుద్ధంగా సిని మాలు, ఈవెంట్స్‌ను ప్రసారం చేసే పైరసీ సైట్లపై ఉక్కుపాదం మోపే దిశగా టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా తమ సెర్చ్ ఇంజిన్స్ ప్రమాణాలను మరింత కఠినతరం చేయనున్నాయి. బ్రిటన్‌కి చెందిన మేధోహక్కుల కార్యాలయం (ఐపీవో) సారథ్యంలో దీనికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ రంగ సంస్థలతో స్వచ్ఛందంగా ప్రవర్తనా నియమావళి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.