Jathi Ratnalu Movie Sequel Confirmed By Director Anudeep KV - Sakshi
Sakshi News home page

జాతిరత్నాలు..డబుల్‌ డోస్‌ రాబోతుంది..

Published Fri, Mar 19 2021 6:38 PM | Last Updated on Fri, Mar 19 2021 7:48 PM

Jathi Ratnalu Sequel To Be Made Soon : Director Anudeep - Sakshi

నవీన్‌  పొలిశెట్టి ప్రధాన పాత్రలో అనుదీప్‌ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఉప్పెన తర్వాత ఆ స్థాయిలో బాక్స్‌ఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాగా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయాలో వసూళ్లను రాబడుతోంది. వినోదమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు రాష్ల్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ సత్తా చాటుతోంది. మొదటి వారం పూర్తి కాక ముందే అర మిలియన్ డాలర్ల మార్క్‌ను సాధించి, మిలియన్‌ రేసులోకి అడుగుపెట్టి నిర్మాతలకు కాసుల పంట కురిపిస్తోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది.


ఈ సందర్భంగా డైరెక్టర్‌ అనుదీప్‌..జాతిరత్నాలు సీక్వెల్‌పై వస్తోన్న వార్తలపై  స్పందించారు. తప్పకుండా జాతిరత్నాలు సీక్వెల్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సినిమాతో అనుదీప్‌ దర్శకుడిగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే అనుదీప్‌కు సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది.


ఈ మధ్య కాలంలో హీరోకు సమానంగా  డైరెక్టర్‌కు సైతం ఇంత పాపులారీటి రావడం అనుదీప్‌కే సొంతమైందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. తనదైన కామెడీ పంచులతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ సినిమాకు రథన్ సంగీతం అందించారు. నవీన్‌కు జోడీగా  ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ  ప్రధాన పాత్రలు పోషించారు. 

చదవండి : ఈ చిన్నసినిమా ఏకంగా బాహుబలి రికార్డునే బీట్‌ చేసింది
(అలా హిట్టు పడగానే ఇలా రేటు పెంచిన 'జాతిరత్నం'!)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement