Naveen Polishetty Movie With Anushka Under UV Creations Banner - Sakshi
Sakshi News home page

Naveen Polishetty: యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నవీన్‌ సినిమాపై క్లారిటీ..

Published Sun, Dec 26 2021 5:18 PM | Last Updated on Sun, Dec 26 2021 5:34 PM

Naveen Polishetty Movie With Anushka Under UV Creations Banner - Sakshi

Naveen Polishetty Confirms New Film With Anushka Shetty: ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్‌ పొలిశెట్టి.. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. జాతిరత్నాలుతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత నవీన్‌- అనుష్క జంటగా యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఓ సినిమా రానుందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై యూవీ క్రియేషన్స్‌ వారు క్లారిటీ ఇచ్చారు. నవీన్‌ పొలిశెట్టి బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే అనుష్క ఈ చిత్రంలో నవీన్‌కి జోడీగా కనిపించనుంది. నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయితో ఎలా ప్రేమలో పడుతుంది? ఆ తర్వాత వారి ప్రయాణం​ ఎలా సాగిందన్నదే సినిమా కథ. పి. మహేశ్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’అనే టైటిల్‌ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement