కొరటాల శివతో ఏజెంట్‌? | Koratala Siva teams up with Naveen Polishetty | Sakshi
Sakshi News home page

కొరటాల శివతో ఏజెంట్‌?

Oct 15 2020 1:03 AM | Updated on Oct 15 2020 5:17 AM

Koratala Siva teams up with Naveen Polishetty - Sakshi

కొరటాల శివ, నవీన్‌ పోలిశెట్టి

ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఎక్కువ శాతం బ్యాలెన్స్‌ ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తోనూ ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు కొరటాల. తాజాగా ఆయన నెక్ట్స్‌ సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆచార్య’ పూర్తి చేసి, అల్లు అర్జున్‌ సినిమా ప్రారంభం అయ్యేలోగా ఓ చిన్న ప్రాజెక్ట్‌ను డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా కోసం ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో నవ్వులు పంచిన నవీన్‌ పోలిశెట్టిని హీరోగా తీసుకోవాలనుకుంటున్నారని టాక్‌. ఇదో పూర్తి స్థాయి ప్రేమకథ అని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement