‘జనతా గ్యారేజ్’ (2016) తర్వాత దర్శకుడు కొరటాల శివ, హీరో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర గురించి పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు కాస్త పొలిటికల్ టచ్ కూడా ఇస్తున్నారట కొరటాల. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ప్రస్తుతం కొరటాల ‘ఆచార్య’, ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చేస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గి, ఈ ఇద్దరూ చేతిలో ఉన్న సినిమా పూర్తి చేయాలి. ఆ తర్వాత వీరి కాంబినేషన్ సినిమా చిత్రీకరణ ఆరంభమవుతుంది. అయితే విడుదల తేదీని మాత్రం ఫిక్స్ చేసేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment