Anushka Shetty Romance With Naveen Polishetty, Deets Inside - Sakshi
Sakshi News home page

Anushka Shetty: మిస్‌ చెఫ్‌?

Published Sat, Apr 30 2022 5:22 AM | Last Updated on Sat, Apr 30 2022 11:07 AM

Anushka Shetty Romance With Naveen Polishetty - Sakshi

విభిన్నమైన వంటకాలు, వాటి రెసిపీలు తెలుసుకునే పనిలో ఉన్నారట అనుష్కా శెట్టి. తన చేతి వంట రుచి చూపించేందుకు రెడీ అయ్యారట. వంటల గురించి యూట్యూబ్‌ చానెల్‌ ఆరంభించడానికే అనుష్క ఇలా కుకింగ్‌ మీద దృష్టి పెట్టారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ వంటల రీసెర్చ్‌ చేస్తున్నది తన తాజా సినిమా కోసం అని సమాచారం. అనుష్కా శెట్టి, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన తారాగణంగా ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి ఓ టాక్‌ వినిపిస్తోంది. అదేంటంటే... ఈ చిత్రంలో ఓ అంతర్జాతీయ చెఫ్‌ పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నారట. ఈ పాత్రలో ఒదిగిపోవడానికే పాకశాస్త్రంలోని అంశాలపై పట్టు సాధించే పనిలో ఉన్నారట. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క చేస్తున్న చిత్రం ఇదే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement