
Naveen Polishetty New Movie Update On His Birthday: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తానెంటో నిరూపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ‍్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన ప్రత్యేకమైన నటనతో అలరిస్తున్న ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా నవీన్‌కు బర్త్‌డే విష్ చెబుతున్నారు అభిమానులు. అంతేకాకుండా నవీన్‌తో యూవీ క్రియేషన్స్ చేస్తున్న సినిమాను ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా గ్రామ్ వేదికగా చెప్పుకొచ్చాడు నవీన్.
తాజాగా తన మరో సినిమా గురించి ప్రకటించాడు ఈ యంగ్ హీరో. నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పోర్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. 'ప్రొడక్షన్ నెం 15'గా రూపొందుతున‍్న సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ నవీన్ ప్రకటించాడు. ఈ పోస్టర్‌లో పంచెకట్టులో కనిపించాడు నవీన్. ఈ పోస్టర్‌ను నవీన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.
The Entertainer is coming back to deliver the entertainment royale 👑😍
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) December 26, 2021
Wishing a very Happy Birthday to the young sensation @naveenpolishety ❤️
Title out soon! 🤩#HBDNaveenpolishetty #NaveenPolishetty4 @kalyanshankar23 @vamsi84 #SaiSoujanya @SitharaEnts pic.twitter.com/hYEbn0A3wP
ఇదీ చదవండి: రాధేశ్యామ్ ప్రీ రిలీజ్‌కు హోస్ట్‌గా జాతి రత్నం..
Comments
Please login to add a commentAdd a comment