
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సితారా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థకు షాక్ ఇచ్చాడు. నవీన్ ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోగా.. జాతి రత్నాలు మూవీతో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. ఈ మూవీతో నవీన్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో అతడికి సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో స్వీటీ అనుష్కతో ఓ సినిమాతో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ప్రాజెక్ట్స్‌కు సంతకం చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అయితే సితార ఎంటర్‌టైమెంట్ సంస్థ దగ్గర నవీన్ తీసుకున్న 4 కోట్ల రూపాయల పారీతోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: బిగ్‌బాస్: ఐదో సీజన్‌లో కీలక మార్పులు.. సక్సెస్‌పై అనుమానాలెన్నో!
అయితే ఈ తాజా బజ్ ప్రకారం నవీన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌లోని ఈ సినిమాను కాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. రంగ్ దే మూవీ కో డైరెక్టర్ కథ వినిపించగా నవీన్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించాడట. అయితే మార్పులు చేసినప్పటికి కథ పూర్తి కాకపోవడంతో నవీన్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేశాడట. అయితే దీనిలో ఎంతవరకు నిజముందనేది హీరో కానీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ స్పందించేవరకు వేచి చూడాలి. మరోకపక్క అనుష్క అనుకున్న మరో మూవీపై కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. మరోపక్క యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. మరి ఈ సారి నవీన్ ఎలాంటి సినిమాలతో రాబోతున్నాడో తెలుసుకొవాలంటి ఇంకా కొంతకాలం వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment