
Naveen Polishetty: కరోనా కష్టకాలంలో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అభిమానులకు అండగా ఉంటున్నాడు. ఈ మమహ్మారి కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులను తన మాటలతో ఓదార్పునిస్తున్నాడు. సర్‌ప్రైజ్ కాల్ చేసి విషాదంలో మునిగిపోయిన కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని అందిస్తున్నారు.
కరనా బారిన పడి తన తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తన తల్లి బాధతో కుంగిపోతుందని సాయి స్మరణ్ అనే నెటిజన్ ఇటీవల నవీన్ పొలిశెట్టికి ట్వీట్ పెట్టాడు. అంతే కాకుండా ‘జాతిరత్నాలు’చూశాక అమ్మ కొంత బాధను మర్చిపోయిందని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. సాయి ట్వీట్‌ను చూసిన నవీన్.. ‘‘మనకెంతో ఇష్టమైన వాళ్లు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ అమ్మకు ‘జాతిరత్నాలు’ కొంతవరకూ ఊరట కలిగించినందుకు ఆనందిస్తున్నా. మీ వివరాలను నాకు పంపించండి త్వరలోనే సర్‌ప్రైజ్ చేస్తా’ అని రిప్లై ఇచ్చాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా నవీన్.. సాయికి ఫోన్ చేశారు. సాయి వాళ్లమ్మతో కొంత సమయంపాటు వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘అమ్మ మరలా నవ్వింది. బాధ నుంచి బయటపడడం కోసం ప్రేమ ఎంతో అవసరం. అవసరమైన వారికి చేతనైనంత సాయం చేయండి’ అని నవీన్ విజ్ఞప్తి చేశాడు
Comments
Please login to add a commentAdd a comment