Rashmika Mandanna Praises Suhas Latest Movie Writer Padmabhushan - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: రష్మిక

Published Tue, Feb 7 2023 5:26 PM | Last Updated on Tue, Feb 7 2023 6:09 PM

Rashmika Mandanna Praises Suhas latest Movie Writer Padmabhushan - Sakshi

విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్‌.  యూట్యూబ్‌ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్‌ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్‌ పద్మభూషణ్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన సుహాస్ మూవీని పలువురు సినీతారలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా చేరిపోయింది. ఈ సందర్భంగా చిత్రబృందాన్ని ట్వీట్ చేసింది పుష్ప భామ. 

రష్మిక తన ట్విటర్‌లో రాస్తూ.. ' మీరు చాలా అందమైన సినిమా తీశారు. మీ చిత్రబృందాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న మీకు ప్రత్యేక అభినందనలు. ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి వెళ్లి ఈ చిత్రాన్ని చూస్తారని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మహిళల కోసం ప్రత్యేకంగా ఈనెల 8న ఉచిత షోలు ఏర్పాటు చేసినట్లు రైటర్ పద్మభూషణ్ చిత్రబృందం ప్రకటించింది.

మాస్ మహారాజా రవితేజ సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రాన్ని కొనియాడారు. సుహాస్ నటన అద్భుతంగా ఉందని.. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ హృదయానికి హత్తుకునేలా ఉందని ప్రశంసించారు రవితేజ. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మరో హీరో నవీన్ పోలిశెట్టి సైతం రైటర్ పద్మభూషణ్ చిత్రబృందాన్ని అభిందిస్తూ ట్వీట్ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement