
Naveen Polishetty Anaganaga Oka Raju Movie Title Teaser Out: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా తానెంటో నిరూపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ‍్యామ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు నవీన్ పొలిశెట్టి. తాజాగా నవీన్ హీరోగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పోర్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.
సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'అనగనగా ఒక రాజు' అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ చేసే సందడి మాములుగా లేదు. తన డైలాగ్‌లు, ఆహార్యంతో నవ్వులు పంచుతున్నాడు నవీన్. తన పెళ్లికి తీసే ఫొటోలు సోషల్ మీడియాలో అదిరిపోవాలని, కత్రీనా, విక్కీ కౌశల్ కుళ్లుకోవాలని చెప్పడం సరదాగా ఉంటుంది. 'నేను చెప్పకూడదు కానీ, ఈ డికెడ్‌లో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా' అంటూ వీడియో ముగించారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.
ఇదీ చదవండి: నవీన్ పొలిశెట్టికి మరో బర్త్‌డే గిఫ్ట్.. కొత్త సినిమా అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment