‘జాతిరత్నాలు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నవీన్‌పొలిశెట్టి, తరువాతి ప్రాజెక్ట్‌పై అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ ఫార్చ్యూన్ 4 సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
కళ్యాణ్ శంకర్ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి ఎంటర్టైనర్ గా బలమైన కథతో సాగనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో 'భీమ్లా నాయక్' అనే మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment