
మంత్రి కేటీఆర్ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు.
చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అయిన సినిమా ‘జాతిరత్నాలు’. కేవీ అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ సరికొత్త వినోదాన్ని పంచింది. థియేటర్‌కు వెళ్లిన ప్రతి ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వచ్చాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాపై సీనీ ప్రముఖులు సైతం పొగడ్తల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.39.04 కోట్ల షేర్, రూ.70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా మంత్రి కేటీఆర్ ‘జాతిరత్నాలు’పై ప్రశంసల జల్లుకురిపించారు. ఆదివారం ‘జాతిరత్నాలు’ వీక్షించిన మంత్రి.. సినిమా చాలా నచ్చిందని, కామెడీ హిలేరియస్‌గా ఉందని ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ కు హీరో నవీన్ పోలిశెట్టి కూడా స్పందించారు. థాంక్యూ సార్…మీకు నచ్చడం చాలా హ్యాపీగా ఉంది అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా, ఈ సూపర్ హిట్ అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం ఏప్రిల్ 11నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Thank you so much sir @KTRTRS 🙏 so happy you loved it #JathiRatnalu https://t.co/czkkj99Ynd
— Naveen Polishetty (@NaveenPolishety) April 11, 2021