
టాలీవుడ్‌లో అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 17 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈ దేవసేనకు.. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 2005లో సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించారు. బాహుబలి లాంటి సినిమాల్లో నటించి పాన్ ఇండియా స్టార్ అయింది.
అనుష్క చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో షెఫ్ అన్విత రవళి శెట్టిగా అనుష్క నటిస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క ఇప్పుడు లండన్ వెళ్లేందుకు సిద్దమతుందని సమాచారం.
అయితే ఇది హాలీడే ట్రిప్ కాదట.. నవీన్ పొలిశెటి సినిమా షూటింగ్ కోసం ఆమె లండన్ వెళ్తున్నారు. దాదాపు పదిరోజుల పాటు అక్కడ షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్‌లో అనుష్క, నవీన్ పొలిశెట్టిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. లండన్ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో కొన్ని కీలకమైన సీన్స్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ ఎండ్‌లోగా షూటింగ్‌ను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment