
సాక్షి, తిరుపతి: జాతి రత్నాలు సినిమా సక్సెస్ కావడంతో ఫుల్ హ్యాపీగా ఉందీ టీమ్. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం జాతి రత్నాలు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొతం చేసుకుంది. హీరోల కామెడీకి థియేటర్‌లోకి వెళ్లిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుని బయటకు వస్తున్నారు.
మొత్తానికి సినిమా సూపర్‌గా ఉందంటూ అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో జాతిరత్నాలు టీమ్ సంతోషంలో మునిగి తేలుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా హీరోహీరోయిన్లు నవీన్, ఫరియా అబ్దుల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. కాగా పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిన్న సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించగా స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment