
నవీన్, అనుష్క ఒరిజినల్ పేర్లనే ఇలా చమత్కరించి టైటిల్‌గా పెట్టడం బాగుందని అంటున్నారు నెటిజన్లు
నలభై ఏళ్ల మహిళ, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడతారు. వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియడానికి చాలా సమయం ఉంది. నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి ప్రధాన పాత్రధారులుగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నవీన్, అనుష్క ఒరిజినల్ పేర్లనే ఇలా చమత్కరించి టైటిల్‌గా పెట్టడం బాగుందని అంటున్నారు నెటిజన్లు. మరి.. ఈ టైటిలే ఖరారవుతుందా? వెయిట్ అండ్ సీ.