ఓటీటీలో జాతిరత్నాలు: మీరనుకునే డేట్‌ కాదు! | Jathi Ratnalu Movie OTT Release Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో రానున్న జాతిరత్నాలు!

Published Tue, Mar 23 2021 1:32 PM | Last Updated on Tue, Mar 23 2021 4:57 PM

Jathi Ratnalu Movie OTT Release Date Locked - Sakshi

చాలా రోజులకు థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు వెలిశాయంటే అది కేవలం జాతిరత్నాలు సినిమా వల్లే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించి మెప్పించింది. రాహుల్‌, ప్రియదర్శి, నవీన్‌ల కామెడీకి నవ్వుకోని ప్రేక్షకుడే లేడంటే అతిశయోక్తి కాదు. అనుదీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న రిలీజైనప్పటి నుంచి థియేటర్‌లో ఆడుతూనే ఉంది. మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ వాటికి గట్టి పోటీనిస్తూ నిలదొక్కుకుంది. కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ దుమ్ము రేపుతోంది.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. జాతిరత్నాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 10 నుంచి ప్రసారం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. గతంలోనూ ఈ సినిమా ఓటీటీ బాట పడుతోందని, ఇదే నెలలో ప్రసారం కానుందని వార్తలు రాగా వీటిని చిత్రయూనిట్‌ ఖండించింది. మరి వచ్చే నెలలో జాతిరత్నాలు ఓటీటీలోకి వస్తుందన్న ఊహాగానాల్లో ఎంతవరకు నిజముందనేది తేలాల్సి ఉంది!

చదవండి: గోదావరి తీరంలొ నాని సినిమా షూటింగ్‌

చిట్టీ అని పిలుస్తుంటే భలేగా ఉంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement