పూరి హగ్‌... | Tollywood Director Puri Jagannadh New Short Film HUG | Sakshi
Sakshi News home page

పూరి హగ్‌...

Published Sat, Dec 23 2017 12:43 AM | Last Updated on Sat, Dec 23 2017 12:43 AM

Tollywood Director Puri Jagannadh New Short Film HUG - Sakshi

చిన్న చిత్రాల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకుని ఫీచర్‌ ఫిల్మ్స్‌ డైరెక్టర్‌ అయిన వారు టాలీవుడ్‌లో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్‌ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్‌ తొలిసారి ‘హగ్‌’ అంటూ ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించడం విశేషం. ఇప్పటివరకూ డైరెక్టర్‌గా తనలోని ఒక కోణం మాత్రమే చూపించిన ఆయన ఈ నెల 31న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ సినిమా తర్వాత తనయుడు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు పూరి.

‘ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు పూరి ఓ వార్త చెప్పబోతున్నారు’ అంటూ చార్మి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తనయుడితో తీస్తున్న ‘మెహబూబా’ సినిమా గురించి చెబుతారా? లేక మరో విషయం ఏదైనా ఉంటుందా? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ‘‘నా తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ‘హగ్‌’. ఈ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అంటూ ‘హగ్‌’ పోస్టర్‌ కూడా పోస్ట్‌ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పూరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement