
మంత్ర 2తో కోలీవుడ్‌లోకి చార్మీ
నటి చార్మి మంత్ర 2 చిత్రంతో మరోసారి కోలీ వుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తోంది. ఆమె నటించిన మంత్ర చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్ర 2తో మళ్లీ రానున్నారు. మంత్ర థ్రిల్లర్ కథా చిత్రం కాగా మంత్ర 2 దెయ్యం ఇతివృత్తంతో కూడిన హారర్ కథా చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఎస్ సతీష్ తెలిపారు. దెయ్యం చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ మంత్ర 2కు కూడా ఇక్కడ ప్రజాదరణ లభిస్తుందని ఆశించవచ్చు.
చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన సతీష్ చిత్రం గురించి తెలుపుతూ ఆస్తి కోసం అన్న కుటుంబాన్ని తమ్ముడే అంతం చేస్తాడన్నారు. ఈ కుటుంబం నుంచి తప్పించుకున్న చార్మీలో ఆమె తండ్రి ఆత్మ ప్రవేశించి చార్మీని కాపాడడంతో పాటు తన కుటుంబాన్ని అంతం చేసిన తమ్ముడిపైప్రతీకారం తీసుకుందన్నదే చిత్ర కథాంశం అన్నారు.ఈ చిత్రాన్ని తమిళంలో ఎస్ ఎస్ ఎస్ ఫిలింస్ పతాకంపై ఎస్ సుందరం అనువదించి విడుదల చేయనున్నారు.