
ఇన్నాళ్లకు కుదిరింది!
‘‘దాదాపు ఏడేళ్ల క్రితం చేసిన ‘మంత్ర’ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. మళ్లీ అలాంటి సినిమా చేయమని చాలామంది ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ‘మంత్ర 2’తో ఇన్నాళ్లకు అది కుదిరింది’’ అని చార్మి చెప్పారు. కె.ఎ. రవికుమార్‌రెడ్డి సమర్పణలో ఎస్.వి. సతీష్ దర్శకత్వంలో వి. యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘చార్మీ అందించిన సహకారం మరువలేనిది. 20రోజుల పాటు ఏకధాటిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షూటింగ్ చేసేవారామె. సంగీతదర్శకుడు చక్రి ఈ తరహా సస్పెన్స్, థ్రిల్లర్ చేయడం ఇదే మొదటిసారి’’ అని చెప్పారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ తరహా చిత్రం రాలేదని దర్శకుడు పేర్కొన్నారు.