Mantra 2
-
భయపెడుతూ.. కవ్విస్తూ...
‘మంత్ర’ చిత్రంలో ‘మాహా..మాహా...’అంటూ ఒక పక్క తన అందంతో కవ్విస్తూనే మరోవైపు భయపెట్టారు చార్మి. మళ్లీ ‘మంత్ర-2’తో ఆమె ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. గ్రీన్ మూవీస్ పతాకంపై పి.శౌరిరెడ్డి, వి.యాదగిరిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.వి.సతీశ్ దర్శకుడు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ చిత్రాలకు విభిన్నంగా ఉంటుంది. స్క్రిప్ట్‌ను నమ్మి చార్మి ఈ చిత్రంలో నటించారు. ఆద్యంతం సాగే సస్పెన్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుంది’’ అని నిర్మాత తెలిపారు. చార్మికి మంచి పేరు తీసుకువచ్చే చిత్రమిదని, ఆమె అభినయం ఈ చిత్రానికి హైలైట్ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కాశ్యప్, ఛాయాగ్రహణం: తనికెళ్ల రాఘవేంద్ర, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె.సురేశ్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి. -
మంత్ర 2తో కోలీవుడ్లోకి చార్మీ
నటి చార్మి మంత్ర 2 చిత్రంతో మరోసారి కోలీ వుడ్ ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తోంది. ఆమె నటించిన మంత్ర చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్ర 2తో మళ్లీ రానున్నారు. మంత్ర థ్రిల్లర్ కథా చిత్రం కాగా మంత్ర 2 దెయ్యం ఇతివృత్తంతో కూడిన హారర్ కథా చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు ఎస్ సతీష్ తెలిపారు. దెయ్యం చిత్రాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ మంత్ర 2కు కూడా ఇక్కడ ప్రజాదరణ లభిస్తుందని ఆశించవచ్చు. చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహించిన సతీష్ చిత్రం గురించి తెలుపుతూ ఆస్తి కోసం అన్న కుటుంబాన్ని తమ్ముడే అంతం చేస్తాడన్నారు. ఈ కుటుంబం నుంచి తప్పించుకున్న చార్మీలో ఆమె తండ్రి ఆత్మ ప్రవేశించి చార్మీని కాపాడడంతో పాటు తన కుటుంబాన్ని అంతం చేసిన తమ్ముడిపైప్రతీకారం తీసుకుందన్నదే చిత్ర కథాంశం అన్నారు.ఈ చిత్రాన్ని తమిళంలో ఎస్ ఎస్ ఎస్ ఫిలింస్ పతాకంపై ఎస్ సుందరం అనువదించి విడుదల చేయనున్నారు. -
ఆ షరతుతోనే ఈ సినిమా చేశా!
‘‘నేను నటించిన ‘మంత్ర’ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ పిక్చర్‌గా నిలిచింది. నాకు నంది అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ‘మంత్ర 2’ కథ చెప్పగానే నాకు బాగా నచ్చేసింది. కానీ కచ్చితంగా హిట్ సినిమా చేయాలనే షరతుతోనే అంగీకరించాను’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన ప్రాతలో శ్రీనివాస నాయుడు చామకూరి సమర్పణలో గ్రీన్ మూవీస్ పతాకంపై పి. శౌరి రెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ఎస్. వి.సతీశ్ దర్శకుడు. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. చార్మి తల్లి సుర్జీత్ కౌర్ పాటల సీడీలను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ ‘మంత్ర’ సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక ఈ సినిమా చేయడానికి కొంచెం భయపడ్డా. కానీ చిత్రబృందం సహకారంతో చాలా బాగా తీయగలిగాను’’ అని చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రాన్ని తానే విడుదల చేస్తున్నానని నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ చెప్పారు. ఈ కార్యక్రమంలో హీరో చేతన్, రచయిత భాస్కర భట్ల, సహనిర్మాతలు భోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మంత్ర 2’ ఆడియో ఆవిష్కరణ
-
జ్యోతి లక్ష్మీగా చార్మీ!
1970 దశకంలో తమ ఒంపు సొంపులతో తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపిన ఐటం సాంగ్ నటీమణులలో జ్యోతి లక్ష్మీ ఒకరు. ఆమె జీవితానికి దగ్గరగా ఉండేలా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ చిత్రంలో జ్యోతి లక్ష్మీ పాత్రకు చార్మీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ చిత్రానికి సంబంధించి కథను దర్శకుడు పూరీ ఇప్పటికే సిద్ధం చేశారు. జ్యోతి లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం పూరీ అన్వేషణ ప్రారంభించారు. అందులోభాగంగా ప్రముఖ నటి చార్మీని కలసిన ... జ్యోతి లక్ష్మీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథను ఆమెకు పూరీ వివరించారు. ఆ పాత్రలో నటించేందుకు చార్మీ అంగీకరించినట్లు పూరీ సన్నిహితులు వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో జ్యోతి లక్ష్మి చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే చార్మీ ప్రస్తుతం 'మంత్ర 2' తో యమ బీజిగా ఉంది. సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన పూరీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో చార్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుందని ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఇన్నాళ్లకు కుదిరింది!
‘‘దాదాపు ఏడేళ్ల క్రితం చేసిన ‘మంత్ర’ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. మళ్లీ అలాంటి సినిమా చేయమని చాలామంది ఎప్పట్నుంచో అడుగుతున్నారు. ‘మంత్ర 2’తో ఇన్నాళ్లకు అది కుదిరింది’’ అని చార్మి చెప్పారు. కె.ఎ. రవికుమార్‌రెడ్డి సమర్పణలో ఎస్.వి. సతీష్ దర్శకత్వంలో వి. యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘మంత్ర 2’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘చార్మీ అందించిన సహకారం మరువలేనిది. 20రోజుల పాటు ఏకధాటిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు షూటింగ్ చేసేవారామె. సంగీతదర్శకుడు చక్రి ఈ తరహా సస్పెన్స్, థ్రిల్లర్ చేయడం ఇదే మొదటిసారి’’ అని చెప్పారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఈ తరహా చిత్రం రాలేదని దర్శకుడు పేర్కొన్నారు. -
మంత్ర 2తో మళ్లి భయ పెట్టుతోన్న చార్మి