జ్యోతి లక్ష్మీగా చార్మీ! | Charmme is Puri's Jyothi Lakshmi | Sakshi
Sakshi News home page

జ్యోతి లక్ష్మీగా చార్మీ!

Published Thu, Oct 9 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

జ్యోతి లక్ష్మీగా చార్మీ!

జ్యోతి లక్ష్మీగా చార్మీ!

1970 దశకంలో తమ ఒంపు సొంపులతో తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపిన ఐటం సాంగ్ నటీమణులలో జ్యోతి లక్ష్మీ ఒకరు. ఆమె జీవితానికి దగ్గరగా ఉండేలా  టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ చిత్రంలో జ్యోతి లక్ష్మీ పాత్రకు చార్మీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ చిత్రానికి సంబంధించి కథను దర్శకుడు పూరీ ఇప్పటికే సిద్ధం చేశారు. జ్యోతి లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం పూరీ అన్వేషణ ప్రారంభించారు.

అందులోభాగంగా ప్రముఖ నటి చార్మీని కలసిన ... జ్యోతి లక్ష్మీ ప్రాజెక్ట్కు సంబంధించిన కథను ఆమెకు పూరీ వివరించారు. ఆ పాత్రలో నటించేందుకు చార్మీ అంగీకరించినట్లు పూరీ సన్నిహితులు వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో జ్యోతి లక్ష్మి చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే చార్మీ ప్రస్తుతం 'మంత్ర 2' తో యమ బీజిగా ఉంది. సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన పూరీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో చార్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుందని ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement