jyothi lakshmi
-
‘జ్యోతిలక్ష్మి’ టైంలో పూరీకి ఆ విషయం తెలియకుండా మేనేజ్ చేశా: సత్యదేవ్
విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో సత్యదేవ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సత్యదేవ్ తనదైన నటన స్కిల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన సత్యదేవ్ ఇటీవల గాడ్‌ఫాదర్ మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో ఆయన చేసిన జయదేవ్ పాత్రకి మంచి స్పందన వచ్చింది. గాడ్‌ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా ఓ యూట్యూబ్చానల్తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు! ఇదిలా ఉంటే సత్యదేవ్ సాఫ్ట్వేర్ జాబ్ వదులుకుని మరి ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో ఆయన జాబ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో నటించాడు. ఇక సాఫ్ట్వేర్ జాబ్‌ను పూర్తిగా వదిలేసి సినిమాల వైపే మొగ్గు చూపాడు. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించాడు. ‘అందరు నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చానంటున్నారు. అది నిజం కాదు. సినిమాల్లోకి రావడం కోసమే నేను ఉద్యోగం చేశాను. ఎందుకంటే అవకాశాలు వచ్చి నిలదొక్కునేంత వరకు డబ్బులు కావాలి కదా. డబ్బు కోసమే నేను జాబ్ చేశా. బ్లఫ్ మాస్టర్ సినిమా వరకూ జాబ్ చేస్తూనే షూటింగ్లో పాల్గోన్నాను’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అనంతరం ‘షూటింగ్ కోసం నైట్ షిఫ్ట్‌లు చేశాను. ఉదయం షూటింగ్, నైట్ ఉద్యోగం చేస్తూ వచ్చాను. జ్యోతిలక్ష్మి సినిమాకి గ్యాప్ లేకుండా 39 రోజులు పని చేశాను. ఈ మూవీ చేసేటప్పుడు నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆఫీసులో తెలియదు. జాబ్ చేస్తున్నాననే విషయం డైరెక్టర్ పూరీ గారికి తెలియదు. జాబ్ టెన్షన్ షూటింగ్లో, సినిమా టెన్షన్ ఆఫీసుల కనిపించకుండ మేనేజ్ చేశా. ‘ఘాజీ’, ‘మనవూరి రామాయణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలు అలాగే పూర్తి చేశాను’ అని చెప్పాడు. ఈ సందర్భంగా చిరంజీవిగారితో చేయాలనేది తన కల అని, ఆయనతో కలిసి నటించాలనే తన డ్రీమ్‌ను చాలా ఏళ్లుగా భద్రపరుచుకుంటూ వచ్చానన్నాడు సత్యదేవ్. -
‘సోషల్ మీడియా దుమారమే’
జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గువ్వా గోరింక’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాపై ఓ ఆసక్తికరమైన పాటను రూపొందించారు. ‘అరె దగ్గరి వాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాకా, ఇది ఆండ్రాయిడూ మజాకా. ఒడవని ముచ్చట రచ్చగ మార్చి పిచ్చెక్కిస్తది కాకా, నువు అందులోన దిగినాకా.. అంటూ సాగే ఈ పాటలో సోషల్ మీడియా ట్రెండ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ, ప్రియాలాల్, మధుమిత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సోషల్ మీడియ దుమారమే’
-
జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది?
తమిళసినిమా: మనిషిలో మానవత్వం మరుగున పడుతోందా? లేక లేని మానవత్వం ముసుగులో మనిషి బతుకుతున్నాడా? ఒక వ్యక్తితో అవసరం ఉంటే ఆయన్ని మీ అంతటి వారు ఈ ధరణిలోనే లేరని బట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతారు.అవసరం లేకపోతే ఎదురుపడినా ముఖం చాటేసుకుని పోతుంటారు. ఈ దేశం ఎటు పోతోంది? మృగ్యమవుతున్న మానవత్వంలో మనిషి గమ్యం ఎటువైపు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో స్వార్థం పరుగులు తీస్తుందన్నది ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటనతో తేటతెల్లమైంది. ప్రజల్లో సానుభూతి కరువవుతోందని చెప్పక తప్పదు. భారతీయ స్టార్ డాన్సర్, నటీమణి జ్యోతిలక్ష్మి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె సాధారణ నటీమణి కాదు. తెలుగు,తమిళం,మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన గొప్పనటి, నర్తకి. ముఖ్యంగా తెలుగు,తమిళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అజరామర నటిగా కీర్తి గడించారు. జ్యోతిలక్ష్మి జీవించి ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన సినిమా జనం, డాన్సింగ్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురించిన వందిగామదులు ఆ నటీమణి కన్నుమూస్తే ఆమెకు నివాళులర్పించడానికి కూడా రాలేకపోయారు. తన కుటుంబానికి సానుభూతిని అందించే ప్రయత్నం చేయలేకపోయారు. ఐదు భాషా చిత్రాల్లో నర్తించి అశేష ప్రేక్షకులను అలరించిన జ్యోతిలక్ష్మిని చివరి చూపు చూడడానికి పట్టుమని పది మంది సినీ ప్రముఖులు కూడా రాలేదంటే మానవత్వం ఏ స్థాయిలో మంటగలుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో చానళ్ల కెమెరాల ముందు జ్యోతిలక్ష్మి లెజెండ్, డాన్సింగ్ క్వీన్ అంటూ నాలుగు ముక్కలు మాట్లాడి చేతులు దులిపేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ జ్యోతిలక్ష్మి సాధించిన కీర్తి తక్కువేమీ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరఫున సమాచార, ప్రచార శాఖామాత్యులు జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాంటిది ఇక్కడి చిత్ర ప్రముఖలు ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ సంతాపం తెలపకపోవడం విచారకరం. అదే రోజు ఒక తమిళ సీనియర్ రచయిత, దర్శక నిర్మాత కన్నుమూస్తే ప్రముఖ నటుల నుంచి, దర్శక నిర్మాతలు తరలి వెళ్లి నివాళులర్పించారు. మరి జ్యోతిలక్ష్మి తమిళ కుటుంబానికి చెందిన నటే. ఆమెకు ఆ సానుభూతి దక్కకపోవడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి ఒక్క జ్యోతిలక్ష్మికే కాదు ఇంతకు ముందు చాలా మంది విషయంలోనూ జరిగింది. ఒక ప్రఖ్యాత గీత రచయిత రాసిన ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్న గీత ం గుర్తుకొస్తోందీ సంఘటన చూస్తుంటే. ఈ ధోరణి మారాలి. మానవ విలువలు పెంపొందాలని ఆశిద్దాం. ఇది ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆలోచించాల్సిన అంశం ఇది. -
నటి జ్యోతిలక్ష్మికి కన్నీటి వీడ్కోలు
నాటి మేటి నృత్యతార జ్యోతిలక్ష్మి ఇక లేరు. 68 ఏళ్ల జ్యోతిలక్ష్మి మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని రామరాజ్ వీధిలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న ఈమె కొన్ని రోజులు అపోలో ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందారు. అనంతరం ఇంట్లోలోనే చికిత్స పొందుతూ వచ్చారు. కేన్సర్ వ్యాధి ముదరడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. జ్యోతిలక్ష్మి పూర్వీకం తంజావూరు. తండ్రి పేరు టి.కె.రామరాజన్, తల్లి శాంతవి. వీరికి ఎనిమిది మంది సంతానం. వారిలో ముగ్గురు రాజ్‌కుమార్, టి.ఆర్.బాలసుబ్రమణ్యం, టీఆర్.రవికుమార్ కొడుకులు, జ్యోతిలక్ష్మి, ప్రతిమాదేవి, లక్ష్మీ, లత, జయమాలిని కూతుళ్లు. వీరిలో నటి జ్యోతిలక్ష్మి పెద్ద కూతురు. చిన్న కూతురు నటి జయమాలిని. జ్యోతిలక్ష్మిని మేనత్త ప్రఖ్యాత నటి ధనలక్ష్మి దత్తత తీసుకున్నారు. ప్రముఖ నాట్యాచారులు తంజై రామయ్యదాస్ వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందిన జ్యోతిలక్ష్మి శివాజీగణేశన్ సమక్షంలో భరతనాట్య తెరంగేట్రం చేశారు. 1963లో తన మావయ్య టీఆర్.రామన్న దర్శకత్వం వహించిన పెరియ ఇడత్తు పొన్ను చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఇందులో ఎంజీఆర్, సరోజాదేవి హీరోహీరోయిన్లుగా నటించారు. అదేవిధంగా తెలుగులో జీవనాంశం చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. అలా వరుసగా తమిళం, తెలుగు భాషా చిత్రాలతోపాటు కన్నడం, మలయాళం, హిందీ అంటూ బహుభాషా నటిగా ప్రాచుర్యం పొందారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నర్తకిగా అన్ని రకాల పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు జ్యోతిలక్ష్మి. తెలుగులో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి అగ్రనాయకులతోను, ఆ తర్వాత తరం మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ నుంచి నేటి యువ నటుల వరకు నటించిన ఘనత జ్యోతిలక్ష్మిది. ముగ్గురు ముఖ్యమంత్రులతో.. ఎన్టీ.రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన చరిత్ర జ్యోతిలక్ష్మిది. 300 చిత్రాలకు పైగా వివిధ రకాల పాత్రలకు వన్నె తెచ్చిన జ్యోతిలక్ష్మి కొంత కాలం బుల్లి తెరపైనా మెరిశారు. పలు టీవీ సీరియళ్లలో నటించారు. బతికున్నంత కాలం నటించాలని కోరుకున్న జ్యోతిలక్ష్మి అదేవిధంగా జీవించారు. తెలుగులో శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన కుబేరులు చివరి చిత్రం కాగా తమిళంలో ఇటీవల యువ సంగీత దర్శకుడు హీరోగా నటించిన త్రిష ఇల్లన్న నయనతార చివరి చిత్రం. మరో మూడు తమిళ చిత్రాల్లో నటించడానికి అంగీకరించారు. ఈ లోగా అనారోగ్యానికి గురై ఈ లోకాన్ని విడిచారు. జ్యోతిలక్ష్మికి భర్త సాయి్రపసాద్, కూతురు జ్యోతిమీనా ఉన్నారు. సాయిప్రసాద్ తెలుగు వారనేది గమనార్హం. ఈయన ప్రముఖ చాయాగ్రాహకుడు దేవరాజ్ సోదరుడు. జ్యోతిలక్ష్మి, సాయిప్రసాద్లది ప్రేమవివాహం. జ్యోతిలక్ష్మి మృతికి దక్షిణ భారత సినీ ప్రముఖులు పలువురు నివాళులర్పించారు. ఆమె పార్థివదేహానికి మంగళవారం టి.నగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఏం రాశారా అని టెన్షన్!
- చార్మి ‘‘నేను చాలా సినిమాల్లో నటించా. కానీ, ‘జ్యోతిలక్ష్మి’ సినిమా నా జీవితంలో మరచిపోలేనిది. హీరోయిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చిత్రకథ, పాత్రలు, ఆదర్శంగా నిలిచే అంశాలను ఒక పుస్తకంగా తీసుకు రావడం నా అదృష్టం’’ అని హీరోయిన్ చార్మి అన్నారు. చార్మీ ప్రధాన పాత్రలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మి’ చూసి ఇన్స్పైర్ అయిన కె.సర్వమంగళ గౌరి ‘జ్యోతిలక్ష్మి’ అంటూ పుస్తకం రాశారు. ఆ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి పుస్తకం ఆవిష్కరించి, చార్మికి అందించారు. చార్మి మాట్లాడుతూ, ‘‘ప్రీమియర్ షో చూసి, బయటకు వస్తున్నప్పుడు ఒకావిడ సమాజానికి ఉపయోగపడే చిత్రం ఇదని చెబుతోంది. ఆమె ఎవరా అని ఆరా తీస్తే సర్వమంగళ గౌరిగారని తెలిసింది. ఆవిడ ఈ చిత్రంపై పుస్తకం రాశారంటే ఏం రాశారా? అనే టెన్షన్ నాలో ఉంది’’ అని పేర్కొన్నారు. తనికెళ్ల మాట్లాడుతూ- ‘‘ఒక సినిమా మీద పరిశోధక గ్రంథం రాయడమంటే చార్మి, పూరీ ధన్యులయ్యారు’’ అన్నారు. సర్వమంగళ గౌరి మాట్లాడుతూ- ‘‘ఎన్నో సామాజిక అంశాలను ‘జ్యోతిలక్ష్మి’ గుర్తుకు తెచ్చింది. ఈ అంశాలు నన్ను ఇన్స్పైర్ చేయడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ పుస్తకం రాశా’’ అని తెలిపారు. హీరో సత్య, పూరీ తనయుడు ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
చార్మింగ్.. చార్మింగ్!
కొంతమంది పేర్లు భలే సెట్టవుతాయ్. అచ్చంగా ఆ పేరుకి తగ్గట్టుగానే ఉంటారు. ఉదాహరణగా ‘చార్మి’ని చెప్పుకోవచ్చు. నిజంగానే చార్మింగ్‌గానే ఉంటారామె. ఈ పంజాబీ చిన్నది తెలుగు పరిశ్రమలో ఏ తోడూ లేకపోయినా ఎంతో నమ్మకంతో ‘నీ తోడు కావాలి’తో తెలుగు చిత్రపరిశ్రమకు వచ్చారు. మొదటి సినిమాతో ‘ఓహో’ అని పేరు తెచ్చుకోకపోయినా నలుగురి దృష్టిలో పడ్డారామె. చిన్నప్పుడు పిల్లలు పాడుకుంటారే.. ‘చబ్బీ చీక్స్, రోజీ లిప్స్’ అని... చార్మీని చూడగానే ఆ రైమ్ గుర్తుకు రాక మానదు. మొదటి సినిమా తర్వాత తెలుగులో నో చాన్స్. కానీ, ఈ చార్మింగ్ గాళ్‌కి హిందీ, తమిళంలో అవకాశాలు వచ్చాయి. జనరల్‌గా ఒక సినిమా చేసి, ఆ తర్వాత ఏడాది పాటు కనిపించకపోతే, ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే తారల లిస్టులో చేర్చేస్తారు. చార్మీని కూడా అలానే అనుకున్నారు. కానీ, ‘నీకే మనసిచ్చాను’ అంటూ మరోసారి ఇక్కడి తెరపై కనిపించి, ఆ తర్వాత చేసిన ‘శ్రీఆంజనేయం’తో తిరుగు లేని తార అయిపోయారు చార్మి. పధ్నాలుగేళ్లల్లో 50 సినిమాలకు పైగా చేసి, మరో 50 సినిమాలు చేసేంత ఉత్సాహంగా ఉన్నారామె. ఇంతకీ.. చార్మి ఇంత లాంగ్ ఇన్నింగ్స్‌కి కారణం ఏంటి? మొదట్లో గ్లామరస్ క్యారెక్టర్స్‌కే పరిమితం అయినప్పటికీ, ఆ పాత్రల్లో కూడా వీలున్నంతవరకూ చక్కటి అభినయాన్ని ప్రదర్శించగలిగారు చార్మి. ఆ తర్వాత ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’, ‘మంత్ర’, బాపు-రమణల ‘సుందరకాండ’, ‘కావ్యాస్ డైరీ’, ‘మంగళ, ‘ప్రేమ ఒక మైకం’... ఇలా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు చేయడం చార్మి కెరీర్‌కి ప్లస్ అయ్యింది. తెలుగులో చేస్తూనే, తమిళ, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు హిందీ చిత్రం ‘బుడ్ఢా హోగయా తేరా బాప్’ కూడా చేశారు. అంతేకాకుండా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి చేరిపోయారు. తాను నటించిన పాత్రలకు మాత్రమే కాకుండా చివరికి ‘చందమామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకు కూడా డబ్బింగ్ చెప్పారు. ముంబయ్ నుంచి ఇక్కడికి వచ్చి, తెలుగు నేర్చుకుని.. ఆల్మోస్ట్ ‘పదహారణాల తెలుగమ్మాయి’ అయిపోయారు. ఇన్నేళ్ల కెరీర్లో ఒక్క సంవత్సరం కూడా చార్మి ఖాళీగా లేరు. జయాపజయాలతో అప్పుడప్పుడూ ఆటుపోట్లు తగిలాయి కానీ, ‘ఇక చార్మి పెట్టెబేడా సర్దుకోవాల్సిందే’ అని మాత్రం అనిపించుకోలేదు. కేవలం కథానాయికగానే మిగిలిపోకుండా చార్మి నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మి’లో టైటిల్ రోల్ చేసి, ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇంతకూ చార్మి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చార్మి తాజాగా ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. కొత్త లుక్‌లో కనిపించాలన్నదే ఆ నిర్ణయం. ఇప్పుడు కొత్తగా ఎందుకు కనిపించాలంటే... సినిమా సినిమాకీ ఒక కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది కాబట్టి, వాళ్లకు దీటుగా ఉండాలి. అందుకే, కొన్నాళ్ల పాటు బయట ఎక్కడా కనిపించకుండా... గుట్టుగా కసరత్తులు మొదలుపెట్టారు. ఓ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. ఇప్పటివరకూ కనిపించిన చార్మి వేరు.. ఈ మేకోవర్ తర్వాత కనిపించబోయే చార్మి వేరు. ఆ కొత్త లుక్ చూస్తే.. ఎవరికైనా ‘పోకిరి’లో మహేశ్‌బాబు చెప్పిన ‘దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది’ గుర్తుకు రావాల్సిందేనట. పధ్నాలుగేళ్ల కెరీర్ తర్వాత రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేయాలనుకోవడం మాటలు కాదు. పైగా.. శరీరాకృతిని మార్చుకుని మరీ చేయడం అంటే ఎంతో పట్టుదల ఉండాలి. చార్మికి అది ఉంది కాబట్టే, ఇన్నేళ్లయినా ఇంకా ఇక్కడ ఉండగలిగారు... ఇప్పుడు కొత్తగా మేకోవర్ అవుతున్నారు కాబట్టి, ఇంకొన్నేళ్లు ఉండగలుగుతారు. ఆల్ ది బెస్ట్ చార్మి! -
దేవుడు కూడా... తెలుగు సినిమా తీయలేడు!
- దర్శకుడు పూరి జగన్నాథ్ పూరి స్పీడు... చార్మి అంతకన్నా యమస్పీడు... వాళ్ళి కాంబినేషన్లో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘జ్యోతి లక్ష్మీ’ కూడా పేరు నుంచి పాటల విజువల్స్ దాకా ప్రతి అంశంతో స్పీడుగా జనాన్ని ఆకర్షిస్తోంది. శుక్ర వారం విడుదలైన ఆ సినిమా గురించి పూరి, చార్మి ‘సాక్షి’ మీడియా గ్రూప్‌తో మాట్లాడారు. పూరి చెప్పిన కబుర్లు... * ‘‘ ‘ఇడియట్’లో హీరో పాత్ర చంటి, హీరోయిన్ను ‘ఒసేయ్’ అన్నాడని ఒకరు తిడితే, మరొకరు సరిగ్గా అలాంటి అబ్బాయి కోసమే వెతికి పెళ్ళి చేసుకున్నారు. ప్రేక్షకుల్లో ఒకరికి నచ్చింది, మరొకరికి నచ్చదు. అందరికీ నచ్చేలా ఆ దేవుడు కూడా తెలుగు సినిమా తీయలేడు.’’ * ‘‘వేశ్య అంటే సాటి ఆడవాళ్లకే ఇష్టం ఉండదు. మగవాళ్లు ఇష్టపడతారు. ఆడవాళ్లు మాత్రం అసహ్యించుకుంటారు. 45 ఏళ్ల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు వేశ్య కథతో ‘మిసెస్ పరాంకుశం’ నవల రాసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలాగే ఉన్నాయి.’’ * ‘‘ఈ సినిమాలో ‘ఆడవాళ్లను అర్థం చేసుకోకపోయినా ఫర్లేదు....గౌరవించండి చాలు’ అని నేను రాసిన డైలాగ్ చాలామందికి నచ్చింది. మగాళ్లలో చాలామంది ఆడవాళ్లను చిన్నచూపు చూస్తారు. నేనీ సినిమా తీయడం వెనక ఉన్న ఉద్దేశం ఒకటే ...మహిళలు ఏ వృత్తిలో ఉన్నా, వారిని అందరూ గౌరవించాలి. అంతే... బేసిగ్గా నేను ఫెమినిస్టును. ఆడవాళ్లను సాటి ఆడవాళ్లే గౌరవించాలి. అందుకే ఈసారి నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలను తీయాలనుకుంటున్నా.’’ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి... పక్కనున్న పోలీస్ స్టేషన్లో అప్పగించా! - చార్మి చార్మి చెప్పిన కబుర్లు... * ‘‘పూరి గారు ఈ కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కానీ హీరోయిన్గా కాకుండానే నా మీద నిర్మాత అనే బాధ్యతా పెట్టారు. ‘జ్యోతిలక్ష్మీ’లో నేను నటించలేదు.. ప్రవర్తించానంతే.’’ * ‘‘ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి చెబుతాను. కొత్తగా కారు కొనుక్కొని హైదరాబాద్‌లో చాలా రద్దీలో ఉన్న ట్రాఫిక్‌లో వెళుతున్నాను. ఇంతలో ఒకతను వచ్చి కారును గుద్దాడు. సారీ చె ప్పి వెళ్లిపోకుండా, అనవసరంగా మాతో గొడవ పెట్టుకున్నాడు. కార్లో ఉన్న నన్ను చూసి హీరోయిన్స్ గురించి తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించాను. హీరోయిన్స్ అంటే గౌర వం లే ని వాళ్లు... తమ ఇంట్లోని ఆడ వాళ్లను కూడా గౌరవించ రని నా ఫీలింగ్.’’ -
జ్యోతిలక్ష్మి ఆడియో విడుదల
-
జ్యోతిలక్ష్మికి సీక్వెల్ రాబోతుందా
-
జ్యోతిలక్ష్మి వెండితెరపై వెలుగనుందా?
-
పొగిడితే కానీ పనిచేయదు!
హీరోయిన్ చార్మికి నిన్న ఆదివారం నాటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, నెల్లూరు నుంచి బెంగు ళూరు, ఢిల్లీ దాకా ఆమె అభిమానులు చాలామంది స్వయంగా వచ్చి, చార్మి ఎదురుగానే ఆమె తమకెందుకో ఇష్టమో కవితలు, పాటలు, మాటల రూపంలో చెప్పి మరీ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. చార్మి కథానాయికగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే ‘చార్మ్ మి’ పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ‘‘నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నిర్మాత సి. కల్యాణ్ నాకు ‘జ్యోతిలక్ష్మీ’ సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం’’ అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు. సినిమా గురించి ఆయన చెబుతూ, ‘‘రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో’’ అని వ్యాఖ్యానించారు. నటుడు సంపూర్ణేశ్‌బాబు, రచయిత భాస్కరభట్ల, కెమేరామన్ పి.జి. విందా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. అన్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు. సినిమాలో ‘హీరోయిజమ్ కాదు... హీరోయినిజమ్ చూస్తారు’ అన్న మాటలకు అర్థం అదేనా! -
జ్యోతిలక్ష్మిగా వెలిగిపోతున్న ఛార్మి
-
మిసెస్ పరాంకుశమే ఈ జ్యోతిలక్ష్మి
‘‘ నాకు చాలా ఇష్టమైన స్క్రిప్టు ఇది. ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు తన 19వ ఏట రాసిన ‘మిసెస్ పరాంకుశం’ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించా. కానీ ఈ ట్రెండ్‌కు తగ్గట్టు మార్పులూ చేర్పులూ చేశాను’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో చార్మి ప్రధాన పాత్రలో సి.కె ఎంటర్టైన్మెంట్స్, శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమా ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చార్మి మాట్లాడుతూ -‘‘కళ్లు మూసి తెరిచే లోపు ఈ సినిమా పూర్తయిపోయింది. నేను నిజజీవితంలో ఎలాగైతే ప్రవరిస్తానో, ఈ సినిమాలో అలాగే చేశాను. ఈ సినిమాలో నేను జీవించానంతే’’ అని తెలిపారు. ‘‘మహిళల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలకు అద్దం పట్టే సినిమా ఇది. పూరి గారు ఇప్పటిదాకా చేసిన సినిమాలకు చాలా విభిన్నంగా ఉంటుంది’’ అని గేయ రచయిత భాస్కర భట్ల అన్నారు. ఈ నెల 17న చార్మి పుట్టిన రోజు సందర్భంగా సినిమా టీజర్‌ను లాంచ్ చేయనున్నామని, ఈ నెలాఖరులో పాటలను, జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు పీజీ విందా, బీఏరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఛార్మీ- జ్యోతిలక్ష్మీ టీజర్ విడుదల
-
జ్యోతి లక్ష్మీగా చార్మీ!
1970 దశకంలో తమ ఒంపు సొంపులతో తెలుగు చిత్రసీమను ఓ ఊపు ఊపిన ఐటం సాంగ్ నటీమణులలో జ్యోతి లక్ష్మీ ఒకరు. ఆమె జీవితానికి దగ్గరగా ఉండేలా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ 'జ్యోతి లక్ష్మీ' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆ చిత్రంలో జ్యోతి లక్ష్మీ పాత్రకు చార్మీని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆ చిత్రానికి సంబంధించి కథను దర్శకుడు పూరీ ఇప్పటికే సిద్ధం చేశారు. జ్యోతి లక్ష్మీ పాత్రలో ఒదిగిపోయే నటి కోసం పూరీ అన్వేషణ ప్రారంభించారు. అందులోభాగంగా ప్రముఖ నటి చార్మీని కలసిన ... జ్యోతి లక్ష్మీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథను ఆమెకు పూరీ వివరించారు. ఆ పాత్రలో నటించేందుకు చార్మీ అంగీకరించినట్లు పూరీ సన్నిహితులు వెల్లడించారు. ఈ ఏడాది చివరిలో జ్యోతి లక్ష్మి చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే చార్మీ ప్రస్తుతం 'మంత్ర 2' తో యమ బీజిగా ఉంది. సూపర్ డూపర్ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన పూరీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో చార్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబవుతుందని ఫిలింనగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఈ ఉపాధ్యాయులు మాకొద్దు
పూడూరు, న్యూస్‌లైన్: పూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహోదగ్రులయ్యారు. టీచర్లను పాఠశాల నుంచి పంపించివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన సంఘటన శనివారం పూడూరులో చోటుచేసుకుంది. స్థానిక సర్పంచ్ యాదమ్మ, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, విద్యార్థిని హాషంబీ తెలిపిన వివరాల ప్రకారం.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా ఆయా జట్లకు విద్యార్థులను ఎంపిక చేసే విషయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, విద్యార్థిని హాషంబీల మధ్య గొడవ జరిగింది. దీంతో హాషంబీ ‘నేను క్రీడల్లో పాల్గొనబోను.. నా జట్టు విద్యార్థుల కూడా ఆడరు’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘నీతో పాటు తోటి విద్యార్థులను కూడా ఆడకుండా చేస్తావా’ అంటూ పాఠశాల పీఈటీ దేవదాసు మందలించారు. ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి విద్యార్థిని హాషంబీపై చేయిచేసుకున్నారు. దీంతో హాషంబీ జరిగిన విషయాన్ని తన కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పాఠశాలకు వచ్చి విద్యార్థినిని ఎందుకు కొట్టారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు గొడవ మొదలైంది. వీరిని సముదాయించేందుకు పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. విషయం చినికిచినికి గాలివానగా మారింది. గ్రామస్తులు, విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గొడవపడుతున్నారనే సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని గొడవకు గల కారణాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను సముదాయించి ఆయన వెళ్లిపోయారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొదట్నుంచీ అభ్యంతరకరంగానే.. జ్యోతిలక్ష్మి, దేవదాసులు పూడూరు పాఠశాలలో విధుల్లో చేరాకే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని విద్యార్థులు, గ్రామ సర్పంచ్ యాదమ్మ, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. అప్పటి నుంచి వారు పాఠాలు బోధించడం మానేసి కబుర్లు చెప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముందే ఒకరికొకరు పుష్పాలు ఇచ్చుకోవడం వంటివి చేసేవారంటూ మండిపడ్డారు. ఇటువంటి చర్యలు పిల్లల ముందు చేయరాదని.. విద్యార్థులు కూడా లేనిపోనివి అలవాటు చేసుకుంటారంటూ గతంలోనే పాఠశాల హెచ్ఎం (ఎంఈఓ) రాంరెడ్డి, డిప్యూటి డీఈఓకు పాఠశాల ఎస్ఎసీ చైర్మన్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిలో మార్పు తీసుకువస్తానని హెచ్ఎం నచ్చజెప్పడంతో అప్పట్లో శాంతించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా విద్యార్థులపై దాడి చేయడం సరైంది కాదంటూ పెద్ద ఎత్తున నినదించారు. గ్రామ సర్పంచ్, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్లకు కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారంటూ వారు మండిపడ్డారు. పాఠశాలలో ఈ ఇద్దరి ఉపాధ్యాయుల ఆగడాలను అడ్డుకోడంలో విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహించి శనివారం నేరుగా డీఈఓ సోమిరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన డీఈఓ పాఠశాల హెచ్ఎం రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. జరిగిన విషయం, ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, దేవదాసు ప్రవర్తనపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు. దీంతో ఎంఈఓ పాఠశాలకు చెందిన మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు, సర్పంచ్, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ల అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారు చేసి డీఈఓకు పంపించారు. పూడూరు మండల కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ యాదమ్మ, పాఠశాల చైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా డీఈఓ కలిసి తమ వాదనను వినిపించి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరివెళ్లారు.