ఎందుకంత ఓవరాక్షన్‌.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి | Tollywood Director Puri Jagannadh Video | Sakshi
Sakshi News home page

Puri Jagannadh: లవ్ అనేది కేవలం ఆ పనికోసమే: పూరి జగన్నాధ్

Published Wed, May 1 2024 9:04 PM | Last Updated on Thu, May 2 2024 11:38 AM

Tollywood Director Puri Jagannadh Video

టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగువారికి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. లైగర్ తర్వాత ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పూరి మ్యూజింగ్స్‌ పేరుతో వాయిస్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో వీడియోను విడుదల చేశారు. ఇందులో ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ..'జీవితంలో చాలామంది ప్రేమలో ఫెయిల్ చూస్తారు. తిండి, నిద్ర ఉండదు. గుండెల్లో తెలియని మంట. దానికితోడు మద్యానికి బానిస అవుతాం. స్నేహితులు ఎంత ఓదార్చినా తీరని బాధ. కన్నీళ్లు ధారలుగా కారుతుంటాయి. అదొ రకమైన నరకం. నా ప్రేమను అమ్మాయి అర్థం చేసుకోలేదని కుంగిపోతాం. నిజానికి అదంతా ప్రేమ కాదు.. ఈగో.. నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు. ఇది నిజం. నీకు దక్కలేదన్న ఉక్రోశమది. పాపం ఆ అబ్బాయి నీ గురించి తాగుబోతు అ‍య్యాడే అని అందరూ తనకు చెప్పాలి. అది నీ అసలు ఉద్దేశం' అని అన్నారు.

మీ అమ్మ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎప్పుడైనా అమ్మ కోసం కత్తిపెట్టి చేయి కోసుకున్నావా? ఏడ్చావా? లేదు. మన ప్రేమలన్నీ శృంగారం కోసమే. అందమైన అమ్మాయిలనే ఎందుకు ప్రేమిస్తావ్. కాళ్లు, చేతులు లేని వాళ్లను కూడా ప్రేమించొచ్చు కదా? నిజంగా అమ్మాయిని ప్రేమిస్తే.. ఆమె డెసిషన్‌కు రెస్పెక్ట్‌ ఇచ్చేవాడివి. ప్రేమలో ఉన్నప్పుడు నీకోసం పుట్టిన దేవతలా కనిపిస్తుంది. ఆ అమ్మాయి దొరక్కపోతే చనిపోవాలనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే నిన్నే పెళ్లి చేసుకుంటే రెండేళ్లు కూడా సరిగా కాపురం చేయలేవు. మోజు తీరిపోద్ది. మళ్లీ కొత్త కోరికలు మొదలవుతాయి. వేరే అమ్మాయిలు కావాలి. ఎంజెల్స్‌ అందరినీ మగాళ్లు పెళ్లి తర్వాత డోర్ మ్యాట్స్‌లా తయారు చేస్తారు.  సైన్స్‌ ప్రకారం ఆడ, మగ మధ్య ఎట్రాక్షన్‌ 18 నెలలు మాత్రమే' అని

లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లందరూ  ప్రామిస్‌ చేయగలరా? వేరే ఏ అమ్మాయిని చూడమని? చేయలేరు. ప్రేమించడం, ఇంట్లో వద్దంటే గొడవ పడడం.. అమ్మాయి కాదంటే దేవదాసులా మారడాలు.. ఇవన్నీ డ్రామాలు. మనం ఈ డ్రామాలనే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తాం. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలను ఎక్కడైనా చూశారా?. వాళ్లు ఎప్పుడూ ఏడుస్తూ ఉండరు. చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. మరీ మీకెందుకు ఇంత ఓవరాక్షన్. వాళ్లను చూసి బుద్ది తెచ్చుకో. లవ్ ఫెయిల్‌ అవడం ఎప్పుడూ మంచిదే. దానివల్ల మీరు మరింత స్ట్రాంగ్‌ అవుతారు. కానీ ప్రేమించమని ఏడుస్తూ.. బతిమిలాడుతూ.. అడుక్కుంటూ బెగ్గర్స్‌లా తయారవుతాం. రోజు ఇంత ఏడుస్తున్నావు కదా.. ఏడాది తర్వాత అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని' వివరించారు.

నిజంగా అమ్మాయి మోసం చేస్తే.. ఆ బాధను మీ కెరీర్ కోసం వాడండి. ప్రేమ కంటే గొప్పది ఒంటరితనం. ఒంటరిగా తినండి, ప్రయాణాలు చేయండి. కొన్నేళ్ల తర్వాత మిమ్మల్ని చూసి మీరే నవ్వుకుంటారు. మీ లవ్‌ ఫెయిల్యూర్‌ మీద మీరే జోకులు వేసుకుంటారు. లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్న ఎంజెలినా జోలి లాంటి సెలబ్రిటీలే విడాకులు తీసుకున్నారు. వాళ్లతో పోలిస్తే.. నువ్వు ఎంత? నీ ప్రేమ ఎంత? దయచేసి ఆలోచించు. నిన్ను నమ్ముకొని మీ కుటుంబం ఉంది' అని పూరి జగన్నాథ్‌ సలహాలిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement