
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీని దూరం పెట్టి హీరోయిన్ చార్మీతో కలిసి తిరుగుతున్నాడని, అందుకే హైదరాబాద్‌కు రావడం తగ్గించేశాడని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సైతం సిద్ధపడ్డాడంటూ వార్తలు వచ్చాయి. గతంలో ఈ విడాకుల రూమర్స్‌పై పూరీ తనయుడు ఆకాశ్ స్పందిస్తూ అదంతా అబద్ధమని స్పష్టం చేశాడు. అయినా ఆ వదంతులకు చెక్ పడలేదు.
తాజాగా ఆ వార్తలను కొట్టిపారేస్తూ తన కుటుంబంతో కలిసి కనిపించాడు పూరీ. తన సొంతూరు అయిన నర్సీపట్నంలో అన్నదమ్ములు, కుటుంబసభ్యులతో కలిసి సందడి చేశాడు. భార్య లావణ్యతో పాటు పిల్లలతో కలిసి హోమాన్ని ఆచరించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇకపోతే పూరీ జగన్నాథ్ చివరగా లైగర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా లెవల్‌లో రిలీజైన ఈ మూవీ ఘోర పరాజయం పాలై తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ డిజాస్టర్ రిజల్ట్ ఫలితంగా ఇకనైనా పట్టాలెక్కుతుందనుకున్న జనగణమన సినిమా మొదలుపెట్టకముందే మళ్లీ ఆగిపోయింది. పూరీ.. చిరంజీవితో, విశ్వక్‌సేన్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment