నాది ప్రేమ వివాహమే
ఏ తరహా పాత్రనైనా సమర్థవంతంగా పోషించగల సత్తా వున్న నటి ఛార్మి. టాలీవుడ్, బాలీవుడ్‌లలో నటిస్తూ విరామం అన్నది ఎరుగని ఈ భామ తమిళ ప్రేక్షకులకు పరిచయమున్న నటే. కోలీవుడ్‌లో కాదల్ అళువదిల్లై, ఆహా ఎత్తనై అళగు, లాడం తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన చార్మికి తాజాగా పెళ్లి ఆలోచనలు ముసురుకుంటున్నాయనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ప్రేమ, పెళ్లికి సంబంధించిన అంశాల గురించే అధికంగా ప్రస్తావిస్తున్నారు.
అయితే తానెవరిని ప్రేమించడం లేదని అంటున్నారు. తాజాగా చార్మి ఏమంటున్నారంటే... నటిగా రీ ఎంట్రీ అనే పదానికే తన జీవితంలో తావు లేదు. చివరి శ్వాస ఉన్నంత వరకు సినిమాలోనే ఉంటాను. హీరోయిన్ల భావాలను సినిమా కతీతులైన వారికి అర్థం కావు. నేనిప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదు. అయినా నాది ప్రేమ వివాహమే అవుతుంది. అది సినిమాకు చెందిన వారితోనే జరుగుతుంది. నాకు ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందనేది చెప్పలేను. భవిష్యత్తులో అలాంటిదేదైనా జరిగినప్పుడు చెబుతాను. ప్రస్తుతం తెలుగులో మంత్ర-2 చిత్రం చేస్తున్నానని ఛార్మి అన్నారు.