అంత అసూయ ఎందుకో
అంత అసూయ ఎందుకో
Published Thu, Nov 14 2013 4:06 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
తన అందం చూసి కొందరు అసూయ పడుతున్నారు.. ఎందుకని విరుచుకుపడుతున్నారు నటి చార్మి. ఈ భామ తమిళంలో కాదల్ అళవదిల్లై, లాడెం తదితర చిత్రాల్లో నటించారు. అనంతరం టాలీవుడ్‌లో కొంతకాలం ప్రముఖ హీరోయిన్‌గా రాణించారు. ప్రస్తుతం అక్కడ అనుష్క, కాజల్, సమంత హవా కొనసాగుతండడంతో చార్మీకి క్రేజ్ తగ్గింది. దీంతో సింగిల్ సాంగ్‌లు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. కాస్త బరువు కూడా పెరగడంతో చార్మీ ఇక హీరోయిన్‌గా పనికి రాదనే ప్రచారం జోరందుకుంది.
దీంతో కసిగా ఎక్సర్‌సైజులు చేసి కొన్ని నెలల్లోనే సుమారు 9 కిలోల బరు వు తగ్గి మళ్లీ నాజుగ్గా తయారయ్యారు. కవ్వించే అందాల ప్రదర్శనలో ఫొటో సెషన్ చేయించుకుని ఇంటర్నెట్‌లో పోస్టు చేశారు. తన నూతన అందాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వారి కోసం ప్రతిరోజూ రెండు ఫొటోలు విడుదల చేస్తానని అంటున్నారు. తన కొత్త ఫొటోలు చూసిన కొందరు నటీమణులు ఉడుక్కుంటున్నారని, అంత అసూయ వారికెందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఉడుకుబోతు తనం గురించి పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. వారి అసూయ తననేమీ చేయలేదంటున్నారు.
Advertisement
Advertisement