‘‘మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. మథియాస్ కన్నా ముందు నేను కొంతమంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను. కానీ మథియాస్ పరిచయమై, తనతో మాట్లాడటం మొదలుపెట్టాక ఫైనల్‌గా నా అభిప్రాయానికి తగ్గ మనిషిని కనుగొనగలిగాను అనిపించింది’’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్‌మింటన్ ప్లేయర్ మథియాస్, తాప్సీ ఈ ఏడాది మార్చి 23న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నారు.
ఈ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. అయితే మథియాస్‌తో ప్రేమలో పడే ముందు కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టానని తాప్సీ చెబుతూ – ‘‘నాకు క్రీడాకారులంటే ఇష్టం. దేశం కోసం వాళ్లు ఆడుతుంటారు. ఇక మథియాస్‌తో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. అలాగే ఒక నెలలో పుట్టిన ప్రేమ కూడా కాదు. మా మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రేమ పరీక్షలు పెట్టాను. అన్నింటిలోనూ మథియాస్ గెలిచాడు.
ఒక అనుబంధం బలంగా నిలవడం ముఖ్యం. అందుకే నేను తొందరపడలేదు. అంతకు ముందు నాకు పరిచయం ఉన్న అబ్బాయిలు వేరు... మథియాస్ వేరు. ఆ అబ్బాయిల్లో ఏ ఒక్కరినీ మథియాస్‌తో పోల్చలేం. పరిణతి, భద్రతాభావం... ఇవే అతను నాకు సరైన వ్యక్తి అని నిర్ణయించుకునేలా చేశాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment