వారి కోసం
వారి కోసం
Published Mon, Apr 7 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:40 AM
చేసేది చెప్పడం, చెప్పింది చేయడం చాలామంది విషయాల్లో జరగదు. ఏమిటి రాజకీయ పదాల గురించి అనుకుంటున్నారా? వాళ్ల గురించి మనకెందుకులెండి. మనం చక్కగా సినిమా కబుర్లు చెప్పుకుందాం. అలా నటి చార్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేమిటో చూసే ముందు పై వ్యాఖ్యలకు విరుద్ధ వ్యక్తిత్వం చార్మిది. తన మనసులోని మాటలను నిర్భయంగా వెల్లడిస్తారు. తమిళంలో కాదల్ అళవేదిల్లై ఆహా ఎత్తనై అళగు తదితర చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో పలు చిత్రాలు చేశారు. సింగిల్ సాంగ్ నుంచి సంచలనం కలిగించే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అంటున్నారు.
ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగులో ప్రతిఘటన అనే చిత్రంలో నటిస్తున్నానని, ఇది తన 50వ చిత్రం అని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గుైరె , నాలుగున్నరేళ్లుగా కోమాలో పడి ఉన్న యువతి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. తన చిత్రాలు వ్యాపార రీతిగా విజయం సాధించకపోతే తాను ఇన్ని చిత్రాల్లో నటించేదాన్ని కాదని చెప్పారు. అందాన్ని మాత్రమే నమ్ముకుంటే రెండు మూడేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలబడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతిభ చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కాలక్షేపాన్నే కోరుకుంటున్నారన్నారు. తన అభిమానులను ఆనందింప చేయడం కోసం తానెలా నటించడానికైనా రెడీ అని చార్మి అంటున్నారు.
Advertisement
Advertisement