Prathighatana
-
వారి కోసం
చేసేది చెప్పడం, చెప్పింది చేయడం చాలామంది విషయాల్లో జరగదు. ఏమిటి రాజకీయ పదాల గురించి అనుకుంటున్నారా? వాళ్ల గురించి మనకెందుకులెండి. మనం చక్కగా సినిమా కబుర్లు చెప్పుకుందాం. అలా నటి చార్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేమిటో చూసే ముందు పై వ్యాఖ్యలకు విరుద్ధ వ్యక్తిత్వం చార్మిది. తన మనసులోని మాటలను నిర్భయంగా వెల్లడిస్తారు. తమిళంలో కాదల్ అళవేదిల్లై ఆహా ఎత్తనై అళగు తదితర చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో పలు చిత్రాలు చేశారు. సింగిల్ సాంగ్ నుంచి సంచలనం కలిగించే ఎలాంటి పాత్రకైనా సిద్ధం అంటున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగులో ప్రతిఘటన అనే చిత్రంలో నటిస్తున్నానని, ఇది తన 50వ చిత్రం అని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో సామూహిక అత్యాచారానికి గుైరె , నాలుగున్నరేళ్లుగా కోమాలో పడి ఉన్న యువతి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం ఇదన్నారు. తన చిత్రాలు వ్యాపార రీతిగా విజయం సాధించకపోతే తాను ఇన్ని చిత్రాల్లో నటించేదాన్ని కాదని చెప్పారు. అందాన్ని మాత్రమే నమ్ముకుంటే రెండు మూడేళ్లకు మించి ఇండస్ట్రీలో నిలబడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతిభ చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు కాలక్షేపాన్నే కోరుకుంటున్నారన్నారు. తన అభిమానులను ఆనందింప చేయడం కోసం తానెలా నటించడానికైనా రెడీ అని చార్మి అంటున్నారు. -
రేడియో మిర్చి శ్రోతలతో చార్మీ
-
మనుషులు మారితేనే...
చాలా విరామం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి జర్నలిస్ట్‌గా లీడ్‌రోల్ చేస్తున్నారు. రేష్మ, తనికెళ్ల భరణి, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘ఒరిస్సాలో జరిగిన రేప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెబుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చూపిస్తున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని తెలిపారు. బాధ్యతాయుతమైన చిత్రంలో నటించినందుకు రేష్మ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి-యశ్వంత్ నాగ్. -
ఆచితూచి అడుగులు
చార్మి అందగత్తె. నో డౌట్. మంచి నటి. నో డౌట్. ప్రతిభగల అనువాద కళాకారిణి నో డౌట్. ఈ తరం కథానాయికల్లో లేని చాలా క్వాలిటీలు చార్మి సొంతం. హీరోయిన్గా కెరీర్ ఆరంభించి పదకొండేళ్లు నిండినా, చార్మి ఇంకా బిజీగానే ఉన్నారంటే కారణం ఆమెలోని క్వాలిటీలే. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించడం తేలికైన విషయం కాదు. సినిమా భారాన్నంతా భుజాలపై మోయాల్సిన పరిస్థితి. కానీ చార్మి తన యాక్టింగ్‌తో విరివిగా స్త్రీ ప్రాధాన్యతా చిత్రాల్లో నటిస్తూ శభాష్ అనిపించుకున్నారు. మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, ఇందు, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ, ప్రేమ ఒక మైకం... ఇన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన కథానాయికలు ఈ కాలంలో చాలా అరుదు. ఆ దిశగా చూస్తే చార్మి నిజంగా గ్రేట్. ప్రస్తుతం ఆమె నటిస్తున్న మరో స్త్రీ ప్రాధాన్యతా చిత్రం ‘ప్రతిఘటన’. చరిత్ర చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మంత్ర-2’ నిర్మాణ దశలో ఉంది. తన కెరీర్ గురించి ఇటీవల చార్మి మాట్లాడుతూ-‘‘కెరీర్ ప్రారంభమైన నాటినుంచి బిజీగా ఉండటం నిజంగా నా అదృష్టమే. గ్లామర్ పాత్రలు చాలా సినిమాల్లో చేశాను. ప్రేక్షకులు ఆదరించారు కూడా. ఇప్పుడు నటిగా కూడా ఆదరిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. నా దగ్గరకు ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే వస్తున్నాయి. వచ్చిన ప్రతి సినిమాకూ ‘ఓకే’ చెప్ప కుండా ఆచితూచి సినిమాలను అంగీకరిస్తున్నాను. హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ప్రేక్షకాభిమానం, పరిశ్రమ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
ఇది నాకు చాలా స్పెషల్
‘‘సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన ఓ జర్నలిస్ట్ కథ ఇది. చాలా రోజుల తర్వాత కష్టపడి కమిట్మెంట్తో చేశాను. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ప్రతిఘటన’. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో హీరో గోపీచంద్ టీజర్‌ను, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ -‘‘భరద్వాజ్‌గారి ‘అలజడి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ‘ప్రతిఘటన’ చాలా పవర్ఫుల్ టైటిల్. సినిమా కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘చాలా కాలం తర్వాత నేను డెరైక్ట్ చేస్తున్న చిత్రమిది. ఒరిస్సాలో జరిగిన రేప్ కేస్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఇందులో చర్చిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా కెమెరామేన్ ఎస్.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.