ఇది నాకు చాలా స్పెషల్
ఇది నాకు చాలా స్పెషల్
Published Sun, Dec 15 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
‘‘సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన ఓ జర్నలిస్ట్ కథ ఇది. చాలా రోజుల తర్వాత కష్టపడి కమిట్‌మెంట్‌తో చేశాను. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని చార్మి చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ప్రతిఘటన’. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ టీజర్‌ను, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ -‘‘భరద్వాజ్‌గారి ‘అలజడి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ‘ప్రతిఘటన’ చాలా పవర్‌ఫుల్ టైటిల్. సినిమా కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘చాలా కాలం తర్వాత నేను డెరైక్ట్ చేస్తున్న చిత్రమిది. ఒరిస్సాలో జరిగిన రేప్ కేస్ ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ఇందులో చర్చిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా కెమెరామేన్ ఎస్.గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement