మనుషులు మారితేనే... | tamma reddy bharadhwaj new film "prathi ghatana" | Sakshi
Sakshi News home page

మనుషులు మారితేనే...

Published Fri, Jan 31 2014 11:38 PM | Last Updated on Thu, Jul 11 2019 9:16 PM

మనుషులు మారితేనే... - Sakshi

మనుషులు మారితేనే...

 చాలా విరామం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రతిఘటన’. చార్మి జర్నలిస్ట్‌గా లీడ్‌రోల్ చేస్తున్నారు. రేష్మ, తనికెళ్ల భరణి, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ -‘‘ఒరిస్సాలో జరిగిన రేప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి చెబుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చూపిస్తున్నాం. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అని తెలిపారు. బాధ్యతాయుతమైన చిత్రంలో నటించినందుకు రేష్మ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి-యశ్వంత్ నాగ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement