రెండో సారి... | Charmi back in Mantra sequel? | Sakshi
Sakshi News home page

రెండో సారి...

Published Wed, Apr 29 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

రెండో సారి...

రెండో సారి...

 ‘మహా.. మహా’ పాటతో ‘మంత్ర’ సినిమాలో ఎంతగా కవ్వించారో...ఆ సినిమాతో అంత భయపెట్టారు చార్మి.  ఆమె కథానాయికగా  ‘మంత్ర-2’ అనే  చిత్రం రాబోతోంది.  పి. శౌరిరెడ్డి, వి. యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వి. సతీశ్ దర్శకుడు.  చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘‘మంత్ర’ చిత్రానికి ఇది సీక్వెల్ కాదు.  హారర్, సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. మంత్ర సినిమాలో ‘మహా..మహా’ పాట కన్నా  మంచి విజయం సాధిస్తుంది. స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో చార్మి మాకీ అవకాశమిచ్చారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మోహనకృష్ణ, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: శ్రీనివాసనాయుడు చామకూరి, సహ నిర్మాతలు: బోనాల శ్రీకాంత్, రవితేజ, కె. సురేశ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement