ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్ | Charmi's up coming films Mantra-2 | Sakshi
Sakshi News home page

ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్

Published Mon, Oct 7 2013 2:38 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్ - Sakshi

ఇండియన్ స్క్రీన్‌పై చూడని హారర్

చార్మి కెరీర్‌లో గుర్తుంచుకోదగిన సినిమా ‘మంత్ర’. థ్రిల్లర్ చిత్రాల్లో ఆ సినిమా ఓ సంచలనం. ‘మంత్ర’ను అనుసరించి తర్వాత చాలా సినిమాలు విడుదలయ్యాయి. ఆ రకంగా ఆ సినిమాను ఓ ట్రెండ్ సెట్టర్ అని కూడా అనొచ్చు. ప్రస్తుతం చార్మి ‘మంత్ర-2’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ‘మంత్ర’కి ఈ సినిమా కొనసాగింపు కాదని ఆ చిత్రం ప్రారంభంలోనే దర్శకుడు ఎస్.వి.సతీష్, నిర్మాతలు బోనాల శ్రీకాంత్, పి.శౌరిరెడ్డి, రవితేజ తెలియజేశారు. 
 
 అయితే... అదే పేరుతో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఉండటం సహజం. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచుతూ... కథ రీత్యా ఇది సీక్వెల్ కాకపోయినా... ఓ విధంగా సీక్వెలే అనాలని కొత్త రాగం అందుకున్నారు నిర్మాతలు. ఆ వివరాలను తెలుపుతూ-‘‘‘మంత్ర’ మాదిరిగానే ఇది కూడా హారర్ నేపథ్యంలో సాగే కథ. అలాగే... కథనం కూడా ఎక్కువశాతం రాత్రి వేళల్లోనే నడుస్తుంది. చిత్రీకరణ పరంగా చూస్తే ‘మంత్ర’ కంటే ఈ సినిమా బాగా వస్తోంది. 
 
 అందుకే ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. చార్మీ అందిస్తున్న సహకారం మరిచిపోలేం. ఈ నెల మూడోవారం నుంచి ఆర్‌ఎఫ్‌సీలో ఏకధాటిగా జరిగే షూటింగ్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని తెలిపారు. ‘‘మాతృకలోనూ సీక్వెల్‌లోనూ ఒకే కథానాయిక నటించడం ఇండియన్ స్క్రీన్‌పై ఇదే ప్రథమం. ఆ రకంగా చార్మీ చరిత్రలో నిలిచిపోతారు. 
 
 అనుక్షణం ఉత్కంఠకు లోను చేసే సినిమా ఇది. మనదేశంలో ఇప్పటివరకూ ఇలాంటి హారర్ సినిమా రాలేదని నమ్మకంగా చెప్పగలను’’ అని దర్శకుడు చెప్పారు. తనికెళ్లభరణి, రాహుల్‌దేవ్, రావురమేష్, నల్లవేణు, సుధ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివశంకర్, ఛాయాగ్రహణం: ఆర్.పి.తనికెళ్ల, కూర్పు: బాబు సిద్దంశెట్టి, సహ నిర్మాతలు: పవన్, సురేష్ కొండవీటి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement