కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్ | Kai Raja Kai Audio Released | Sakshi
Sakshi News home page

కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్

Published Mon, Sep 29 2014 11:10 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్ - Sakshi

కొత్తవాళ్లు రావాలి : పూరి జగన్నాథ్

‘‘ఈ చిత్ర నిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి చిత్రాలు నిర్మించాలనే సదాశయంతో వచ్చారు. ప్రచార చిత్రాలు చూస్తుంటే దర్శకుడికి మంచి ప్రతిభ ఉన్నట్లనిపిస్తోంది. చిత్రపరిశ్రమకు కొత్తవాళ్లు రావాలి. యువతరంతో నా సంస్థలో సినిమాలు నిర్మించాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. శివ గణేశ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మారుతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కాయ్ రాజా కాయ్’. రామ్ ఖన్నా, మానస్, జోష్ రవి, శ్రావ్య ముఖ్య తారలు. భాస్కర్, సతీశ్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు.
 
 ఆడియో సీడీని పూరి జగన్నాథ్ ఆవిష్కరించి ఎస్వీ కృష్ణారెడ్డికి అందజేశారు. ముగ్గురు కుర్రాళ్ల మధ్య సాగే కథ ఇదని మారుతి చెప్పారు. కాయ్ రాజా కాయ్ ఆట ఆడిన యువకుల జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రకథ అని దర్శకుడు తెలిపారు. మంచి చిత్రం నిర్మించామని నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో హీరోయిన్ చార్మి, నిర్మాతలు అచ్చిరెడ్డి, సి. కల్యాణ్, హీరోలు సందీప్ కిషన్, సంపూర్ణేశ్ బాబు, రచయిత, దర్శకుడు డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement