మే 17న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
పంకజ్ ఉధాస్ (గజల్ సింగర్) చార్మి (నటి)
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులు ఉండవచ్చు. సైన్స్ చదువుకునేవారికి బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మందకొడిగా సాగినప్పటికీ, పనులు పూర్తవుతాయి.
అవివాహితులకు వివాహ యోగం ఉంది. సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశావహంగా ఉంటుంది. సినీరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంది. లక్కీ నంబర్స్: 3,5,8, లక్కీ కలర్స్: ఎల్లో, బ్లూ, గ్రీన్, బ్లాక్, లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు; సూచన: గురువులను, పండితులను గౌరవించడం, వృద్ధాశ్రమాలలో అన్న దానం చేయటం, శనిజపం చేయించుకోవడం.
- ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్