Pankaj Udhas
-
గాయకుడి అంత్యక్రియల్లో సెల్ఫీ పిచ్చి: ‘కొంచెమైనా సిగ్గుండాలి’!
స్మార్ట్ యుగంలో సెల్ఫీలకున్న క్రేజ్అంతా ఇంతా కాదు. సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సమయం, సందర్భం చూసుకోకుండా.. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తారు. దివంగత ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ అంత్యక్రియల సమయంలో జరిగిన ఘటన దీనికి తాజాగా ఉదాహరణ. అనారోగ్యంతో సోమవారం (ఫిబ్రవరి 26న) కన్నుమూసిన పంకజ్ ఉధాస్కు నివాళులు అర్పించేందుకు ఆయన నివాసానికి తరలి వెళ్లారు. తెల్లని దుస్తుల్లో అక్కడున్న వారంతా విషణ్ణ వదనాలతో ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి విద్యాబాలన్ అభిమాని ఒకరు సెల్పీ కోసం వెంటబడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్య ఫ్యాన్ ఒకరు ఆగకుండా విద్యతో కలిసి తన ఫోన్‌ని చేతిలో పెట్టుకుని సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించాడు. పదే పదే వారిస్తున్నా వినకుండా... వెంటబడ్డాడు. అయితే దీనికి ఏమీ స్పందించకుండా, మౌనంగా అక్కడినుంచి వెళ్లిపోయారు విద్యా బాలన్. కొంతమంది విద్యా బాలన్ ప్రవర్తనను కొనియాడగా, మరికొందరు నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొంచెమైనా సిగ్గుండాలి’’ అంటూ ఫ్యాన్‌పై మండిపడ్డారు. View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) కాగా గజల్ మేస్ట్రో అస్తమయంపై యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతోపాటు తమ అభిమాన గాయకుడిని కడసారి దర్శించు కునేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి తరలి వచ్చారు. సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గౌరవాన్ని సంపాదించుకున్న నటి విద్యా బాలన్ కూడా పంకజ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులర్పించారు. విద్యతో పాటు, శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్ మంగళవారం ఆయనకు అంతిమ నివాళులర్పించారు. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
ప్రముఖ సింగర్ పంకజ్ ఉదాస్ (72) కన్నుమూత
-
Pankaj Udhas కాలం పగబట్టిందేమో! మరో దిగ్గజం నింగికెగిసింది!
లెజెండ్రీ గాయకుడు, గజల్ మాస్ట్రో పంకజ్‌ఉద్దాస్ సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడతున్న ఆయన సోమవారం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. పంకజ్ ఉదాస్అనేక ఆల్బమ్‌లను విడుదలచేశారు ప్రపంచవ్యాప్తంగా కచేరీలిచ్చారు. మధురమైన గాత్రంతోనే కాదు, పదునైన సాహిత్యంతో కూడా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. గజల్ పంకజ్.. పంకజ్ గజల్! 'చిట్టి ఆయీ హై', 'జీయే తో జీయే కైసే', 'చుప్కే చుప్కే' 'ఔర్ అహిస్తా', లాంటి పాటలతో దశాబ్దాల పాటు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గళం మూగపోయింది. కానీ తరతరాలుగా శ్రోతల చెవులలో ఆ మధుర గీతాలుప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పంకజ్ ఉద్ధాస్ మరణంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. సోనూ నిగమ్ లాంటి గాయకులు ఆయనను గుర్తు చేసుకొని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. కాలం పగబట్టిందేమో.. పెద్దవాళ్లు, గొప్పవాళ్లు ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు అంటూ కన్నీటి పర్యంత మవుతున్నారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ పంకజ్ ఉద్దాస్ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. Thank you Pankaj Udhas Ji for such masterpieces 😊 RIP to the departed soul 💔 Legend never Dies !! @musicculturehub pic.twitter.com/YAiWccPgvo — Utkarsh (@utkarshh_tweet) February 26, 2024 View this post on Instagram A post shared by Sonu Nigam (@sonunigamofficial) 1951న మే 17, గుజరాత్లో జన్మించారు. తన ముగ్గురు సోదరులలో చిన్నవాడు పంకజ్. చిన్న వయస్సులోనే సంగీతం పట్ల ఆకర్షితులై, తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా భారతీయ సంస్కృతి, సంగీతం ఆయన ముద్ర చెరగనిది. 1980 , 1990 లలో ఆయన పాటలు, గజల్స్ బాగా పాపులర్ అయ్యాయి. గజల్స్‌తోపాటు, బాలీవుడ్ సినిమాల్లో పాటలు అనేకం సూపర్‌హిట్‌గా నిలిచాయి. 1989లో 'నబీల్' ఆల్బమ్ అత్యధికంగా అమ్ముడైన ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. తొలి కాపీ వేలంలో రూ. 1 లక్షకు విక్రయించారు. సంగీత ప్రపంచంలో తన ప్రతిభను చాటుకున్న పంకజ్‌ఉద్దాస్ దాత్వంలోని తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ లక్ష రూపాయలను కేన్సర్ పేషెంట్స్ ఎయిడ్ అసోసియేషన్‌కు అందజేశారు. ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సామాజిక సంక్షేమం కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకుగాను 2006లో భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ దక్కింది. మరికొన్ని సంగతులు పంకజ్‌ఉద్దాస్ కన్సర్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోషారూఖ్ఖాన్ అందుకున్న తొలి పారితోషికం 50 ఆ డబ్బుతో రైల్లో ఆగ్రా వెళ్లి తాజ్ మహల్ చూశామని స్వయంగా షారూఖ్ ఒకసారి వెల్లడించారు. బాలీవుడ్‌కు పాటలను అందించడమే కాకుండా నటుడు జాన్ అబ్రహంను కూడా తెరపైకి తెచ్చింది కూడా పంకజ్ ఉద్ధాస్. పంకజ్ తొలుత డాక్టర్ కావాలనుకున్నారట. తండ్రి కేశుభాయ్ ఒక రైతు , తల్లి జితుబెన్ సాధారణ గృహిణి. పెద్ద సోదరుడు మన్హర్ బాలీవుడ్ చిత్రాలలో హిందీ నేపథ్య గాయకుడు. రెండో అన్నయ్య నిర్మల్ ఉద్దాస్ కూడా ప్రసిద్ధ గజల్ గాయకుడే. పంకజ్ భార్య ఫరీదా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు- నయాబ్, రీవా -
లెజెండరీ సింగర్ పంకజ్ ఉదాస్ కన్నుమూత
మ్యూజిక్ లెజెండ్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా పంకజ్.. 1951లో గుజరాత్‌లోని జెటూర్‌లో జన్మించారు. చదువుకునే వయసులోనే ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. తన అన్నయ్య మన్హర్ ఉదాస్ బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్‌గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు గడించారు. వారి బాటలోనే పంకజ్ కూడా నడిచారు. 1970లో వచ్చిన తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో తొలిసారి పాట ఆలపించారు. నామ్(1986) సినిమాలో పాడిన చ్టిటి ఆయూ హై పాట పంకజ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది.అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.'చిట్టి ఆయిహై ఆయూహై.. చిట్టీ ఆయిహై..', 'చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే', 'తోడితోడి పియా కరో..' ఇలా బాలీవుడ్లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. గజల్ సింగర్‌గా ఎక్కువ ప్రసిద్ధి పొందారు. పంకజ్ సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.చదవండి: TV Serial Actress Story: ఛాన్స్ కోసం ఆ పని చేయాలి.. వద్దని చెత్త ఏరుకుంది.. తర్వాత లక్షలు ఆర్జిస్తూ.. -
మే 17న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
పంకజ్ ఉధాస్ (గజల్ సింగర్) చార్మి (నటి) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరికి ఈ సంవత్సరం కొంచెం ఒడుదొడుకులు ఉండవచ్చు. సైన్స్ చదువుకునేవారికి బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. మందకొడిగా సాగినప్పటికీ, పనులు పూర్తవుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. సినీరంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆశావహంగా ఉంటుంది. సినీరంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంది. లక్కీ నంబర్స్: 3,5,8, లక్కీ కలర్స్: ఎల్లో, బ్లూ, గ్రీన్, బ్లాక్, లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు; సూచన: గురువులను, పండితులను గౌరవించడం, వృద్ధాశ్రమాలలో అన్న దానం చేయటం, శనిజపం చేయించుకోవడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్