మ్యూజిక్ లెజెండ్, పద్మశ్రీ గ్రహీత పంకజ్ ఉదాస్ (72) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తను పంకజ్ కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా పంకజ్.. 1951లో గుజరాత్‌లోని జెటూర్‌లో జన్మించారు. చదువుకునే వయసులోనే ఆయన కుటుంబం ముంబైకి షిఫ్ట్ అయింది. తన అన్నయ్య మన్‌హర్ ఉదాస్ బాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా రాణించారు. రెండో అన్న నిర్మల్ గజల్ గాయకుడిగా పేరు గడించారు. వారి బాటలోనే పంకజ్ కూడా నడిచారు. 1970లో వచ్చిన తుమ్ హసీన్ మే జవాన్ సినిమాలో తొలిసారి పాట ఆలపించారు. నామ్(1986) సినిమాలో పాడిన చ్టిటి ఆయూ హై పాట పంకజ్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది.
అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులను అలరించారు.'చిట్టి ఆయిహై ఆయూహై.. చిట్టీ ఆయిహై..', 'చాంది జైసా రాంగ్ హై తేరా.. ఔర్ ఆహిస్తా కిజియే బాతే', 'తోడితోడి పియా కరో..' ఇలా బాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించారు. సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. గజల్ సింగర్‌గా ఎక్కువ ప్రసిద్ధి పొందారు. పంకజ్ సేవలను గుర్తించిన కేంద్రం 2006లో పద్మశ్రీతో సత్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment