విక్రమ్‌తో ఐటమ్ సాంగ్ | Charmi Item song for Vikram Samantha 10 Ernathukulla | Sakshi
Sakshi News home page

విక్రమ్‌తో ఐటమ్ సాంగ్

Published Fri, Oct 10 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

విక్రమ్‌తో ఐటమ్ సాంగ్

విక్రమ్‌తో ఐటమ్ సాంగ్

సియాన్ విక్రమ్‌తో ప్రత్యేక గీతానికి రెడీ అవుతోంది చార్మి. ఈ ముద్దుగుమ్మకు ఐటమ్ సాంగ్స్‌లో నటించడం కొత్తేమీ కాదు. ఆ మధ్య టాలీవుడ్‌లో రగడ చిత్రంలో ఏస్‌కో...నా ఘుమ ఘుమ ఛాయ్...ఛాయ్ అంటూ అదిరే అందాలతో దుమ్ము లేపారు. అయితే కోలీవుడ్‌లో ఐటమ్‌సాంగ్ చేయడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో చార్మి అతిథి పాత్రలకు, ఐటమ్‌సాంగ్స్ ఎడాపెడా ఒప్పేసుకుంటోంది. ఐ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం 10 ఎన్రదు కుళ్ల.
 
 సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఒక అదిరిపోయే ప్రత్యేక గీతం ఉందట. ఇది సాధారణ సాంగ్ కాదట. తొమ్మిది నిమిషాల నిడివితో సాగే ఈ పాటలో చార్మిని నటించమన్నారన్నది తాజా సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ ప్రత్యేక గీతం కోసం పూణేలో రెండున్నర కోట్ల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారట. ఈ నెల 20 నుంచి ఈ సెట్‌లో విక్రమ్, చార్మిలతో ఈ పాటను చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోందని తెలిసింది. మొత్తం మీద చాలా కాలం తరువాత కోలీవుడ్ అభిమానులు చార్మీ అందాలను తిలకించనున్నారన్నమాట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement