సంచలనం రేపిన డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్...సిట్ విచారణలో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం. విచారణలో భాగంగా పూరి జగన్నాథ్‌పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. తన గురించి సుమారు 40 నిమిషాల సేపు చెప్పిన పూరీ.. సినిమా ఇండస్ట్రీలో పబ్ కల్చర్ సర్వసాధారణమని, తన సినిమాల్లో ఎక్కువగా పబ్ సీన్లు ఉంటాయని, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా డ్రగ్స్ మాఫియా ప్రధాన సూత్రధారి కెల్విన్ పరిచయం అయినట్లు సిట్ అధికారులు తెలిపారు. అయితే పరిచయం తర్వాతే కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడని తనకు తెలిసినట్లు చెప్పారు.