డ్రగ్స్: తెరపైకి మరో స్టార్ హీరో డ్రైవర్!
-
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు
-
సిట్ కస్టడీలోకి కెల్విన్
హైదరాబాద్: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ను మరికాసేపట్లో సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండురోజులపాటు కెల్విన్‌ను సిట్ అధికారులు విచారించనున్నారు. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడైన కెల్విన్ కాల్‌లిస్ట్ ఆధారంగా 12మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది.
కెల్విన్ కాల్‌లిస్ట్‌లో సినీ ప్రముఖులు ఉండటం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌కు 15మంది ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు విచారణలో తేలినప్పటికీ.. తమ పేర్లు బయటరాకుండా ఒత్తిడి చేసి వారు సైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో సిట్ కీలక ఆధారాలు సేకరించింది. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో నిందితుడిని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే మరిన్ని ఆధారాలు లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.