
డ్రగ్స్ కేసు: కొరియర్ సంస్థలకు నోటీసులు
హైదరాబాద్: సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసులో పలు కొరియర్ సంస్థలకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జరీ చేశారు. గోవా నుంచి హైదరాబాద్‌కు కొరియర్ ద్వారా భారీగా డ్రగ్స్ సరఫరా అయినట్లు సిట్ విచారణలో ప్రధాన నిందితుడు కెల్విన్ విల్లడించిన నేపథ్యంలో నోటీసులు జారీ అయ్యాయి. డ్రగ్స్ పంపినవారు, డెలివరీ తీసుకున్నవారు ఎవరెవరన్న కోణంలో విచారణ చేపట్లనుట్లు అధికారులు వెల్లడించారు. ఇదివరకే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తోంది.
బ్రెండన్, నిఖిల్ శెట్టి, అమన్ నాయుడు డ్రగ్స్ ముఠాలతో తనకు సంబంధం ఉందని, తామంతా ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్‌నే విక్రయిస్తామని సిట్ రెండ్రోజుల విచారణలో డ్రగ్స్ వ్యాపారి కెల్విన్ తెలిపాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారంతో నేడు అమన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్ లను సిట్ తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనుంది. మరో ముగ్గురు నిందితులు బ్రెండన్‌బెన్, అనీష్, పీయుష్ లను కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. వినాయక నిమజ్జనం చివరి ఐదు రోజుల్లో ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులకు భారీగా డిమాండ్ ఉంటుందని విచారణలో కెల్విన్ వెల్లడించినట్లు సమాచారం.
ఇక కొకైన్ బ్యాచ్‌పై దృష్టి
ఇప్పటివరకూ కేవలం ఎల్‌ఎస్‌డీ బ్యాచ్‌ను పట్టుకున్నారని, ఇంకా కొకైన్ బ్యాచ్ ఉందని.. అందులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, వారి పిల్లలు ఉన్నారని బయటకు రావడం మరింత కలకలం రేపుతోంది. దీంతో కేసు కొత్త మలుపులు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ ప్రముఖులు కొకైన్‌ను తీసుకుంటారని, విచారణలో మరికొందరి పేర్లు బయటకు రానున్నాయి. మరోవైపు కస్టడీ గడువు ముగియటంతో సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం కెల్విన్, ఖుద్దూస్, వాహిద్‌లను జడ్జి ముందు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.