సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా జరుగుతోందని మరోసారి తేటతెల్లమైంది. ప లువురు విదేశీయులు ఇక్కడ మాదక ద్రవ్యా లు విక్రయిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్‌శాఖ అంగీకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) స మాచార హక్కు చట్టం ద్వారా వేసిన ప్రశ్నకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో అనేక మార్గాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగు తుండగా.. ఈ వ్యవహారాలను మొత్తం విదేశీయులే నడిపిస్తున్నారని, ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే.. నేరుగా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా నిషేధిత మాదకద్రవ్యాలు చేరుతున్నాయని ఎక్సైజ్‌శాఖ బాంబు పేల్చింది. కొనుగోలుదారులు ఆర్డర్ చేసే డ్రగ్స్ గ్రా ముల్లో ఉండటంతో వాటిని గుర్తించడం కష్టమని, విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఉత్తరాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
గుట్టుగా సాగుతున్న ఈ దందాను మరింత విస్తరించేందుకు విద్యార్థులను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్‌శాఖ అరెస్టు చేసిన డ్రగ్స్ విక్రయదారుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండటం విస్తరించిన నెట్‌వర్క్ తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయా కాలేజీలు బహిష్కరించాయి. ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ నేరుగా ఇంటికే చేరుతున్నాయన్న విషయం కూడా వెల్లడైంది. స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీలను భారత్‌కు దిగుమతి చేస్తున్నారని గుర్తించారు. అదే సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లోని ఓ ఫార్మాలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు.
దర్యాప్తు పైపైనే..
డ్రగ్స్ కేసుల విచారణలో ఎక్సై జ్ శాఖ లోతుగా వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నిందితుల్లో అధికశాతం పలుకు బడి కలిగిన రాజకీయ, సంప న్న కుటుంబాల వారు కావడం తో విచారణ ముందుకుసాగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 2017లోనూ ఇదే తరహాలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ కేసులో 60 మంది పేర్లు జాబితాలో పొందుపరిచిన అధికారులు, మరో 12 మంది సినీ ప్రముఖులనూ గుర్తించారు. తొలుత విచారణ నిష్పక్షపాతంగానే సాగినా.. చార్జిషీట్లలో ఎక్కడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కేసు పక్కదారి పట్టిందన్న విమర్శలకు బలం చేకూర్చింది.
విద్యార్థులు బలి కాకుండా చూడాలి: పద్మనాభరెడ్డి, ఎఫ్‌జీజీ సెక్రటరీ
హైదరాబాద్‌లో విస్తరిస్తోన్న డ్రగ్స్ కల్చర్‌పై ప్రభుత్వం స్పందించాలి. మాదకద్రవ్యాలకు విద్యార్థులు అలవాటుపడితే... అది మొత్తం దేశంపైనే చెడు ప్రభావం చూపుతుంది. ఇకనమోదైన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నిందితులెవరైనా శిక్ష పడేలా చూడాలి.
స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్
Published Wed, Sep 23 2020 5:20 AM | Last Updated on Wed, Sep 23 2020 5:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment