![Tollywood Drugs Case: Telugu Celebrities Get Clean Chit In Drug Case - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/tollywood-Drugs-Case.jpg.webp?itok=uP28HM9G)
టాలీవుడ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. ఈ డ్రగ్ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు క్లిన్ చిట్ లభించింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు సినీ ప్రముఖులకు క్లిన్ చిట్ ఇవ్వగా తాజాగా ఈడీ కూడా ఈ కేసులో వీరికి క్లిన్ చిట్ ఇచ్చింది. ఇటీవల టాలీవుడు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ దిగుమతులతో పాట ఆర్ధిక లావాదేవీలు, నిధుల మల్లింపులపై టాలీవుడ్‌కు చెందిన మొత్తం12 మందిని స్టార్స్‌ను, సెలబ్రెటీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేసింది. ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. దీంతో కొంతకాలంగా డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు ఊరట లభించింది.
Comments
Please login to add a commentAdd a comment