
KTR slams on bjp and congress over Drugs Row. తనకు, డ్రగ్స్‌కు సంబంధం ఏంటీ? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాను అన్ని డ్రగ్స్ టెస్టులకు సిద్ధమని.. రాహుల్ సిద్ధమా? అని సూటిగా ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు ఈడీకీ లెటర్ ఇచ్చాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: దేశంలో అతి తక్కువ రైతులు ఆత్మహత్యలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కొక్కరి చరిత్రలు తెలుసని, గోడలకు పేయింట్ వేసెటోడికి జూబ్లీహిల్స్‌లో నాలుగు ఇళ్లు, నాలుగు ఆఫీసులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, సున్నాలు వేసిన వ్యక్తి కన్నాలు వేస్తున్నాడని మండిపడ్డారు. పదవి కొనుక్కున్నోడు రేపు టిక్కెట్లు అమ్ముకోడా అని నిలదీశారు. దళిత బంధు ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే ఆలోచన జరిగిందని తెలిపారు.
చదవండి: Ganesh Idol Immersion: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
దారిద్య్రరేఖలో అట్టడుగున ఉన్నది దళితులే అందుకే దళిత బంధు ప్రవేశపెట్టామని తెలిపారు. తనకు, డ్రగ్స్‌కు సంబంధం ఏంటీ? అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తాను అన్ని డ్రగ్స్ టెస్టులకు సిద్ధమని.. రాహుల్ సిద్ధమా? అని సూటిగా ప్రశ్నించారు. ఎవడో పిచ్చోడు ఈడీకీ లెటర్ ఇచ్చాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని తెలిపారు. ఎవరినీ వదిలిపట్టం.. అందరి బాగోతాలు బయటపెడతామని కేటీఅర్ హెచ్చరించారు. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడతామని అన్నారు.