Charmy Kaur: టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అకస్మాత్తుగా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్‌ను విచారించిన ఈడీ గురువారం చార్మీని విచారించింది. ఈ సందర్భంగా 2015-17వరకు జరిగిన బ్యాంక్ లావాదేవీల వివారాలను ఆమె ఈడీకి సమర్పించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం చార్మీ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపింది. వాళ్లు అడిగిన అన్ని డాక్యుమెంట్లను సమర్పించానని స్పష్టం చేసింది. ఈడీకి పూర్తిగా సహకరిస్తానని, మరోసారి పిల్చినా విచారణకు హాజరవుతానని పేర్కొంది.
కాగా ఎక్సైజ్ విభాగానికి చెందిన సిట్ దాఖలు చేసిన చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది. దీనిపై విచారణకు హాజరు కావాలని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి, రవితేజతోపాటు డ్రైవర్ శ్రీనివాస్, నవ్‌దీప్, ఎఫ్–క్లబ్ జనరల్ మేనేజర్, ముమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్‌లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment