plants plant
-
అంటగట్టారు!
నల్లగొండ రూరల్/గుర్రంపోడు/ తిప్పర్తి/నిడమనూరు: రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలతో రైతులు నిండా మునిగారు. పూత, కాత బాగానే ఉన్నా, కాయ సైజు పెరగలేదు. పైగా నిమ్మకాయల సైజులో ఉండగానే పసుపు రంగులోకి మారి రాలిపోయాయి. తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి బత్తాయిలో రంగాపూర్ రకం మొక్కలు తీసుకొచ్చి సాగు చేసిన సుమారు 200 మంది రైతులు రూ.60 కోట్ల మేర నష్టపోయారు. దీంతో కొందరు రైతులు ఓ సంఘంగా ఏర్పడి ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు నివేదికను ఆశాఖకు పంపించారు.శాస్త్రవేత్తల ప్రచారంతో..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు సాగుచేసిన జంబేరి మొక్కలు అతివృష్టి, అనావృష్టి, వాతావరణ పరిస్థితుల కారణంగా క్షీణిన్నాయి. అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఉద్యాన శాస్త్రవేత్తలు పరిశో«ధనా కేంద్రాల్లో లభించే రంగాపూర్ వేరు మూలంపై అంటుగట్టిన సాత్‌గుడి రకం బత్తాయి మొక్కలు నాటుకోవాలని ప్రచారం చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి, మహానంది, పెట్లూరు, రైల్వే కోడూరు, మల్లేపల్లి పరిశోధన కేంద్రాల్లోని అంటు మొక్కలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.2014 నుంచి..తిరుపతిలోని ఉద్యాన యూనివర్సిటీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన రైతులు రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలు తీసుకురావడం 2014లో మొదలైంది. సాధారణంగా ఐదునుంచి ఆరు సంవత్సరాలలోపు కాతకు వచ్చి దిగుబడి ఇస్తాయి. కానీ రంగాపూర్ వెరైటీ బత్తాయి మాత్రం కాపు వచ్చినా, కాయలు, రంగుమారి, రాలిపోవడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. తాము నష్టపోవడానికి మొక్కల నాణ్యత లోపాలే కారణమని గుర్రంపోడు, నల్లగొండ, తిప్పర్తి, నిడమనూరు, కనగల్ మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో ఈ రకం సాగు చేసిన సుమారు 70 మంది రైతులు నిర్ధారణకు వచ్చి ఈనెల 11న రాష్ట్ర ఉద్యాన కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశారు.నాసిరకం మొక్కల విషయమై నాగాపూర్ శాస్త్రవేత్తలతో శాస్త్రీయ పరిశోధన చేయించాలని ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై నల్లగొండ కలెక్టర్ ఉద్యాన అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ70 మంది రైతులు రూ.21కోట్ల మేర నష్టపోయారు. దీనిపై విచారణ చేసిన అధికారులు ఉద్యానశాఖకు నివేదిక సమర్పించారు. చాలామంది రైతులు ఇప్పటికే తోటలు తొలగించగా, బిల్లులు లేని కారణంగా ఫిర్యాదు చేయని వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎకరానికి రూ.6లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు గుర్రం శ్రీనివాస్‌రెడ్డి. ఈయనది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని తిప్పలమ్మగూడెం. 2019లో తిరుపతి ఉద్యాన యూనివర్సిటీ నుంచి 700 రంగాపూర్ వెరైటీ బత్తాయి మొక్కలను తీసుకొచ్చి ఐదు ఎకరాల్లో నాటాడు. మొక్కలకు రూ.49వేలు, గుంతలు తీసి నాటినందుకు రూ.50వేలు ఖర్చు చేశాడు.మొక్కలు నాటినప్పటి నుంచి ఎకరానికి ఏడాదికి రూ.80వేల చొప్పున నిర్వహణ ఖర్చులయ్యాయి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటించడంతోపాటు ఉద్యాన వన అధికారుల సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దిగుబడి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ రెండు నుంచి రెండున్నర టన్నుల వరకు దిగుబడి వస్తోంది. గతనెల 27న తిçరుపతి వర్సిటీ నుంచి వచ్చిన ఈ బత్తాయి తోటను పరిశీలించారు. అనంతరం శాంపిల్స్ సేకరించారు. కానీ ఇప్పటి వరకు ఆ రైతు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.ఇతడు నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం జొన్నలగడ్డగూడెం గ్రామానికి చెందిన రైతు చిర్ర భూపాల్‌రెడ్డి. రంగాపూర్ బత్తాయి వెరైటీ అధిక దిగుబడులు, చీడపీడలనుంచి తట్టుకుంటుందని ఎనిమిది ఎకరాల్లో సాగుచేశాడు. ఆరున్నర సంవత్సరాలు గడిచినా నేటికి దిగుబడి రావడం లేదు. దీంతో మూడు ఎకరాల తోటను తొలగించాడు. ఇప్పటి వరకు రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. కాయలు కాస్తున్నా, సైజురాక పసుపురంగులోకి మారి రాలిపోతున్నాయి.మంచి సైజుకు రాకముందే రాలుతున్నాయితిరుపతి పరిశోధన కేంద్రం నుంచి 450 మొక్కలు తెచ్చి 2016లో నాలుగున్నర ఎకరాల్లో నాటాను. ఎనిమిదేళ్లయినా సరైన పూత, కాత రావడం లేదు. 45 నుంచి 50టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా 20 టన్నులే వస్తోంది. కాయ సైజు లేకపోగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. – కేసాని అనంతరెడ్డి, పిట్టలగూడెం రైతుదిగుబడి బాగా వస్తుందని చెప్పిదిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కలు అంటగట్టారు. నాకున్న మూడున్నర ఎకరాల్లో 380 మొక్కల వరకు నాటాను. మొక్కకు రూ.75 నుంచి రూ.100 వరకు వ్యయం చేసి ఏపీ నుంచి మొక్కలు తెచ్చాను. ఇప్పుడు నాలుగో కాత తెంపాల్సి ఉంది. మొక్కలకు కాయలు అంతంత మాత్రంగానే ఉండడం, కాయ బలంగా రాకపోవడం వల్ల దిగుబడి తగ్గి అనుకున్న విధంగా పెట్టుబడులు రాలేదు. – చిత్రం ప్రసాద్, మారుపాక రైతు -
సచివాలయానికి నీడ
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో తాత్కాలిక భవనాల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం.. మొక్కలను సైతం తాత్కాలికంగానే బతికేలా చేసింది. ఆ మొక్కలన్నీ కనుమరుగైపోయి, నీడ కరువైపోయింది. ఆ ప్రాంతమంతా ఎడారిలా మంటెక్కిపోతోంది. దీంతో సచివాలయ సిబ్బంది, పోలీసులు, సందర్శకులు నరకాన్ని చవిచూస్తున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతంలో మళ్లీ పచ్చదనం పరిచి, నీడ కల్పించే చర్యలు చేపట్టింది. సచివాలయ భవనాల పరిసరాల్లో ఇక్కడి మట్టిలో బతికేవి, నీడనిచ్చే 12 వేలకు పైగా మొక్కలను ఈ వర్షాకాలంలో నాటేందుకు సిద్ధం చేస్తోంది. ఇవి కాక అందాన్నిచ్చే మరికొన్ని రకాల మొక్కలూ నాటనున్నారు. భవిష్యత్ అవసరాలను మరిచి నిర్మాణాలు తెలుగుదేశం పార్టీ హయాంలో రాజధాని కోసం 29 గ్రామాలకు చెందిన భూములు తీసుకున్నారు. అప్పటివరకు పచ్చటి తోటలు, పూల వనాలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం 2016 నాటికి పంటలకు దూరమైపోయింది. వెలగపూడి సమీపంలో అసెంబ్లీ, సచివాయాల భవనాలను దాదాపు 45 ఎకరాల్లో నిర్మించారు. సింగపూర్, మలేసియా, జపాన్ అంటూ అందానికి ప్రాధాన్యం ఇస్తూ ఈ నేలకు సరిపోని మొక్కలను తెచ్చి నాటారు. గత ఆరేళ్లుగా అవి మొక్కలుగానే ఉండిపోగా, చాలావరకు చనిపోయాయి. దాంతో భవనాల పరిసరాల్లో నీడే కరువైపోయింది. వేసవిలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. గడిచిన మే నెలలో విజయవాడ, గుంటూరులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, సచివాలయ ప్రాంగణంలో 43.5 డిగ్రీలకు పైగా నమోదైంది. అంటే ఉష్ణోగ్రతలు సహజంగానే ఎక్కువగా ఉండే ఈ రెండు నగరాలకంటే సచివాలయం వద్ద 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత ఉంటోంది. నిత్యం ఇదే పరిస్థితి. నీడనిచ్చే మొక్కలు సిద్ధం గత పాలకుల తప్పులను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వెలగపూడి పరిసరాల్లో నీడనిచ్చేవి, ఇక్కడి మట్టిలో బతికే మొక్కలను నాటాలని సీఆర్డీఏను ఆదేశించింది. గతేడాది సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇరువైపులా, రోడ్డు మధ్యన నీడనిచ్చే బాదం జాతి మొక్కలను నాటారు. అవి ఎనిమిది నెలల్లోనే అనుకున్న స్థాయిలో పెరిగాయి. దీంతో అసెంబ్లీ, సచివాలయ భవనాలు ఉన్న ప్రాంతంలోనూ నీడనిచ్చే వేప, రావి, మామిడి, మహాగని వంటి జాతులకు చెందిన మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఉద్దండరాయునిపాలెం, సచివాలయంలో రెండు నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు 12 వేలకు పైగా నీడనిచ్చే మొక్కలను, పూల మొక్కలను సిద్ధం చేశారు. జూన్, జూలై నెలల్లో వర్షాకాలంలో వీటిని నాటనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఉన్న ప్రాంతంలో చల్లదనం పెరగాలంటే భవనాలకు చుట్టూ కనీసం కిలోమీటర్ పరిధిలో పూర్తిస్థాయిలో నీడనిచ్చే చెట్లు పెంచాలని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నల్ల ఎడారి నల్ల సముద్రం, ఎర్ర సముద్రం.. ఇలా కొన్ని సముద్రాలకు రంగుల పేర్లు ఉన్నాయి. ఎడారికి..? ప్రశ్నే లేదు. ఎడారి అంటే ఒకటే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయేది కొత్తది. ఇది నల్ల ఎడారి. ఎక్కడుంది అంటారా..? మన దగ్గరే.. అమరావతి ప్రాంతంలో. గత తెలుగుదేశం పార్టీ సృష్టి. దానిపేరే తాత్కాలిక సచివాలయం. గత ప్రభుత్వం ఇక్కడి నేల స్వభావానికి సరిపోని విదేశీ మొక్కలు నాటింది. అవి చనిపోవడంతో ఈ ప్రాంతం ఎడారిలా మారింది. నల్ల రేగడి నేలలో ఆ ప్రభుత్వం సృష్టించిన ఎడారి అయినందున దీనిని నల్ల ఎడారి అని అంటున్నారు. -
ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: శనివారం మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్టు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమతమ ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కేటీఆర్‌కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాట డం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా కీలకమని సంతోష్ పేర్కొన్నారు. ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలునాటేలా కార్యాచరణ... రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని సర్పంచులు 2.5 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటేవారు తాము నాటిన మొక్కతో ఫొటో దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్టు తెలియజేశారు. -
అనసూయకు చాలెంజ్ విసిరిన రష్మీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదలైన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' ఇప్పుడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు పాల్గొని, ఒక్కొక్కరు మూడు మొక్కలు చొప్పున నాటుతూ.. మరో ముగ్గురిని మొక్కలు నాటాలని నామినేట్ చేస్తున్నారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. ఈ చాలెంజ్ స్ఫూర్తిగా తీసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తన పేరిట 'రోజా వనం' అనే చాలెంజ్ ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రముఖులకు గ్రీన్ ఇండియ ఛాలెంజ్ విసిరి వారితో మొక్కలు నాటిస్తున్నారు. రోజా విసిరిన చాలెంజ్‌ను స్వీకరించి ఇటీవల హీరో అర్జున్, నటి ఖుబ్బూ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ కూడా రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స్పందించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నానక్‌రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటారు. (చదవండి : గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్) ఈ సందర్భంగా రష్మి మాట్లాడుతూ.. ‘మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్‌ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి. అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి.రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను, వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి’ అని కోరారు. అలాగే తన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను హీరో సత్యదేవ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, ప్రముఖ యాంకర్ అనసూయకు విసిరారు. తన చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. -
25 కోట్ల మొక్కలు నాటాలని సీఎం జగన్ లక్ష్యం
-
అదే సీఎం జగన్ ఆశయం : విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలోని ప్రతి పౌరుడు మూడు మొక్కలు నాటాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో ప్రగతి భారతి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ప్రగతి సాధించేందుకే ప్రగతి భారతి పౌండేషన్ ప్రారంభించామని వెల్లడించారు. కాలుష్యాన్ని అరికట్టాలిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. ఏపీని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఆరు కోట్ల మంది మొక్కలు నాటాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయమని, దానికి ప్రతి పౌరుడు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం అందమైన నగరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత నగర పౌరులదే అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం కేంద్ర బిందువుగా మారాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. విశాఖ నగరానికి ఎంతో చరిత్ర ఉందని, 1926లో తొలి విశ్యవిద్యాలయం (ఆంధ్రా యూనివర్శిటీ) ఇక్కడే ఏర్పడిందని గుర్తు చేశారు. దేశంలోనే తొమ్మిదవ పెద్ద నగరంగా ఉన్న విశాఖను ప్రకృతి, పర్యావరణానికి కేరాఫ్‌గా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అది తప్పకుండా అమలు అవుతుంది విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా సీఎం జగన్ ప్రకటించారని, అది తప్పకుండా అమలు అవుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎవరు అడ్డొచ్చినా మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదని చెప్పారు. మూడు రాజధానులకు బీజేపీ వ్యతిరేకమో కాదో తనకు తెలియదన్నారు. భూములు పోతాయనే భయంతో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, సుజనా కలిసి ఎన్ని కుట్రలు చేసినా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అవతరించి తీరుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
అందుబాటులోకి మొక్క నాటే యంత్రం!
వర్జీనియా పొగాకు సాగు అధిక పెట్టుబడితో కూడిన వ్యవహారం. కూలీలతో మొక్కేత వేయిస్తే ఎకరానికి ఎనిమిది మంది వరకు కూలీలు అవసరం. అచ్చు, సాలు, ఇరువాలు, కాలువలు తీయించడం.. అన్నిటికీ కలిపి ఎకరానికి రూ.5 వేల నుంచి రూ. 6 వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. పైగా కూలీల కొరత నేపథ్యంలో నాట్లు పూర్తి కావడానికి చాలా రోజులు పడుతోంది. ఈ నేపథ్యంలో ఐటీసీ, మహీంద్రా కంపెనీలు పొగ మొక్కలు నాటే యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి సమీపంలోగల తిమ్మాపురం వద్ద ఉన్న కొడవాటి వాసు రైతు పొలంలో ఇటీవల మొక్కలు నాటి, ఈ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. దీనిద్వారా మొక్కేత ఖర్చు తక్కువ. సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. ట్రాక్టర్ వెనుక అమర్చిన ఈ యంత్రం ద్వారా ట్రే పద్ధతిలో పెంచిన పొగాకు మొక్కలను రోజుకు 5 ఎకరాల్లో నాట్లు వేసుకోవచ్చు. యంత్రంతో నాటిన పొగ మొక్కలు ఈ యంత్రం ద్వారా మొక్క నాటడం, మొక్క మొదలు దగ్గరకు మట్టిని ఎగదోసి వత్తడంతోపాటు ప్రతి మొక్కకు 300 మిల్లీ లీటర్ల నీటిని అప్పటికప్పుడే పోయవచ్చు. ఈ యంత్రాన్ని నడిపేందుకు ట్రాక్టర్ డ్రై వర్‌తోపాటు నలుగురు కూలీలు ఉంటే చాలు. గంటకు 1,500 మొక్కల చొప్పున రోజుకు ఐదెకరాల్లో మొక్కలు నాటుకోవచ్చు. ఈ యంత్ర సాయంతో నాటేసేందుకు పొలంలో దుక్కి, అచ్చు ఇరువాలు, కాలువ తీయాల్సిన అవసరం లేదు. అలాగే కలుపు తీసే పని కుడా ఉండదు. కూలీల ఖర్చు, సమయాలతోపాటు సాగు నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు. దాంతో వర్జీనియా పొగాకు రైతులు ఈ యంత్రంపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఖరీదైన ఈ యంత్రాన్ని రైతులు కొనుగొలు చేయాలంటే కష్టం. మండలానికో యంత్రాన్ని ఐటీసీ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉంచితే మేలని రైతులు కోరుతున్నారు. – ఎం.డి. ముజాఫర్ ఖాన్, సాక్షి,అశ్వారావుపేట రూరల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా -
హరిత రథం... అది ఒక కదిలే తోట...
ధనుంజయ్ చక్రవర్తి కోల్‌కతాలోని ఒక ట్యాక్సీ డ్రైవర్. ఆయన ప్రత్యేకత ఏమిటంటే తన ట్యాక్సీపైనే ఒక రూఫ్ టాప్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకొని ముద్దుగా హరిత రథం అనే పేరు పెట్టుకున్నారు. ఇందులో ఏసీ కార్లకన్నా చల్లగా ఉండటం విశేషం. మూడేళ్ల క్రితం అందమైన మనీప్లాంట్ మొక్కతో కారులో మొక్కల పెంపకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇప్పుడు రూ. 22 వేలు ఖర్చుచేసి అంబాసిడర్ కారుపైన తొట్టెను ఏర్పాటు చేసి మట్టితో నింపి గడ్డి పెంచుతున్నారు. దీని బరువు 65 కేజీల వరకూ ఉండటంతో వాహనం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటున్నా దీన్ని కొనసాగించటం విశేషం. కారులోపల వెనుక భాగంలోనూ ఎనిమిది కుండీల్లో మొక్కలు పెంచుతున్నాడు. తద్వారా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తనవంతు ప్రయత్నిస్తూ.. ప్రయాణికులకు ప్రేరణనిస్తున్నారు. ఈ మొబైల్ గార్డెన్ వ్యాన్‌ను నడపటం సాధ్యంకాదని కొందరు తోటి డ్రైవర్లు ఆయన్ను నిరుత్సాహపరచినా వెనక్కు తగ్గలేదు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరు తమవంతు బాధ్యతగా మొక్కలు పెంచాలంటారు ధనుంజయ్. ఆయన ఇచ్చే కరపత్రాలు మొక్కల పెంపకంపై ప్రయాణీకుల్లో ఆసక్తిని పెంచేలా ఉంటాయి. ఐతే మొక్కల పెంపకం కోసం ఇంత తపన పడుతున్న ధనుంజయ్ చక్రవర్తికి సొంత కారు లేదు. ఎనిమిదేళ్లక్రితం యాక్సిడెంట్ కావటంతో చికిత్సకోసం కారును అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పటినుంచి కిరాయి ట్యాక్సీనే నడుపుతూ దాని ద్వారానే ప్రయాణికుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కలిగేంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. అయితే ట్యాక్సీయాజమాని అమ్రిష్ సింగ్, ధనుంజయ్ ప్రయత్నానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ సారి కోల్‌కతా వె ళ్లినప్పుడు తప్పకుండా హరిత రథంలో ప్రయాణిస్తారు కదూ!