
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్టెప్పుల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎందరో స్టార్ హీరోలకు ఆయన ఫేవరెట్ కొరియోగ్రాఫర్. స్టెప్పులతో వెండితెరపై, పంచ్‌లతో బుల్లితెరపై వినోదాన్ని పంచుతాడు. అందుకే టాలీవుడ్‌లో ఏ కొరియోగ్రాఫర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ శేఖర్ మాస్టర్ సొంతం. టాలీవుడ్‌లో టాప్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్‌కి గూగుల్ షాకిచ్చింది. గూగుల్ శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేస్తే.. ఆయన ఫోటోతో పాటు పుట్టిన రోజు 1963 అని, చనిపోయిన రోజు జూలై 8,2003 అని వస్తుంది. ఇది చూసి శేఖర్ అభిమానులు అవాక్కాయ్యారు.
అసలు విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన చైల్డ్ ఆర్టిస్ట్ జేవీ శేఖర్‌ని అందరూ మాస్టర్ శేఖర్ అని పిలిచేవారు. దాదాపు 50పైగా చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8, 2003లో మరణించారు. ఆయన వికీపీడియాలో గూగుల్ పొరపాటున కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటోని అప్‌లోడ్ చేసింది. గూగుల్ చేసిన తప్పు పట్ల శేఖర్ మాస్టర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment