టాలీవుడ్‌లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాకేశ్ (53) ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. 1,500కి పైగా సినిమాల్లోని పాటలకి పని చేసిన ఆయన.. తర్వాత పలు డాన్స్ రియాలిటీ షోలతో మెరిశారు. కరోనా సమయంలో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది. ఆ తర్వాత రాకేశ్ మాస్టరే సొంతంగా పలు యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని పలు వీడియోలు అందులో పోస్ట్‌చేసే వారు. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. అక్కడ ఆయన మామగారు పలు ఆసక్తికరమైన విషయాలు తెలియచేశారు.
(ఇదీ చదవండి: మెగా వారసురాలికి ముఖేష్ అంబానీ స్పెషల్ గిఫ్ట్)
'1996లో కొంత మంది యువకులను గ్రూప్‌గా తయారు చేసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రాకేశ్ మాస్టర్ వచ్చాడు. నాది విజయవాడు.. శేఖర్ మాస్టర్ మా ఇంటికి దగ్గర్లోనే ఉండేవాడు. దీంతో శేఖర్ కుటుంబంతో మంచి సాన్నిహిత్యం ఉంది. శేఖర్‌కు కూడా డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో నేనే అతన్ని రాకేశ్ మాస్టర్ వద్దకు చేర్చాను. ఇలా వారిద్దరూ సినీ పరిశ్రమలో పేరుపొందారు. ఆ రోజుల్లోనే వారి కష్టంతో వచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చేవారు.. దానిని నేనే దాచి హైదరాబాద్‌లోని బోరుబండలో ఇళ్లు కొన్నాను. అందులోనే కొద్దిరోజులు అందరం కలిసే ఉన్నాం. ఆ తర్వాత నేను విజయవాడ వెళ్లిపోయాను. ఈ మధ్య ఎస్‌ఆర్‌కే పేరుతో రాకేశ్ మాస్టర్ ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించాడు. దాని నుంచి మంచి ఆదాయం వస్తుంది.
కొద్దిరోజుల క్రితం నా వద్దకు ఒక ఖాళీ అగ్రిమెంట్ పేపర్‌తో రాకేశ్ మాస్టర్ వచ్చి ఇలా అన్నాడు. 'మామయ్య నువ్వు చనిపోతే నీ కుంటుంబాన్ని నేను కాపాడుతా... ఒకవేళ నేనే ముందు చనిపోతే నీవు అన్యాయం అయిపోతావ్ కాబట్టి ఈ అగ్రిమెంట్ పేపర్ తీసుకో .. నేను చనిపోయిన తర్వాత ఈ ఖాళీ పేపర్‌లో నీకు ఇష్టం వచ్చింది రాసుకో అన్నాడు.'
(ఇదీ చదవండి: చనిపోయే రోజు సౌందర్య ఏం కోరిందో తెలుసా?)
కొడుకు మాదిరి చూసుకున్న వాడే నేడు లేడు.. ఈ ఆస్తులు తనకెందుకు అంటూ ఆ అగ్రిమెంట్ పేపర్‌ను శేఖర్,సత్య మాస్టర్ ముందే ఆ పెద్దాయన చింపేశాడు. తను కష్టపడి సంపాధించిన ఆస్తి రాకేశ్ మాస్టర్ బిడ్డలకే చెందుతుందని ఆయన తెలిపాడు. ఆయన శిష్యులుగా పిల్లల బాధ్యతను తీసుకుంటామని శేఖర్,సత్య మాస్టర్‌లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment